Vijay Deverakonda announces 100 ‘DeveraSanta’ winnersరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్
ఇస్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవరశాంటా 2021
యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చాయి. వాటిలో నుంచి 100
మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున
అందించనున్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మై లవ్స్
దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్
మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అని ట్వీట్ లో
పేర్కొన్నారు.

Also Read – Dhanush’s Telugu-Tamil bilingual SIR/ Vaathi launched


తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు
ఇస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ ఏడాది కూడా ఆయన నగదు రూపంలో
బహుమతులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 100 మందికి 10
లక్షల రూపాయలు బహుమతిగా పంచుతున్నారు.