Young choreographer Vijay Polanki turning headsటాలెంట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. మన స్టార్స్
నుంచి ఎంకరేజ్ మెంట్ కు కొదవేం ఉండదు. అలా ఈ మధ్య అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు యంగ్ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ . ప్యాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్
పొలాకి విజయ్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్ప లో సమంత చేసిన ఊ అంటావా, ఉ ఉ అంటావా సాంగ్ కు కూడా పొలాకి విజయ్ యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతా కు బాగా నచ్చింది.అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్ చేసింది.




రీసెంట్ గా విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేసిన పొలాకి విజయ్ ఇటీవల పుష్పతో పాటు గల్లా అశోక్ హీరో చిత్రానికీ నృత్యాలు అందించారు. హీరో సినిమాలో డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ కు విజయ్ కంపోజ్ చేసిన అదిరే స్టెప్పులకు మంచి పేరొస్తోంది. త్వరలో నరకాసురతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు పనిచేయబోతున్నారు పొలాకి విజయ్ . ఈ యంగ్ కొరియోగ్రాఫర్ స్పీడ్ చూస్తుంటే ఫ్యూచర్ లో స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read – కోలీవుడ్ స్టార్ కార్తి, స్టూడియో గ్రీన్ “నా పేరు శివ 2” జనవరిలో థియేటర్ లలో విడుదల