dhoni-surya-kumar-yadav

కపిల్ దేవ్ తరువాత భారతదేశానికి వరల్డ్ కప్ అందించిన టీం ఇండియా సారధి మహేంద్ర సింగ్ ధోని. అయితే ఆయన ఇండియన్ క్రికెట్ టీం కు సారధ్య బాధ్యతలు తీసుకుని నేటికీ 17 ఏళ్ళు పూర్తి అయ్యాయి.

Also Read – ప్రగతి రధ చక్రాలు పంక్చర్ .. కొనకళ్ళ ఏమైనా చేస్తారా?

2007 సెప్టెంబర్ 14 న ధోని టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నారు. అయితే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే 2007 టీ-20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించారు ధోని.

కెప్టెన్సీ లో తన ప్రత్యేకత చూపిస్తూ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉంచుకున్నారు ధోని. ఇటు బ్యాటింగ్ ఇటు విక్కీ కీపింగ్ అలాగే కెప్టెన్ గా ఇలా అన్ని పాత్రలకు తనవంతు న్యాయం చేసి సచిన్ తరువాత ఆ స్థాయి అభిమానులను సొంత చేసుకున్నారు ధోని.

Also Read – ఒక్కటంటే ఒక్కటే..!

2007 టీ -20 వరల్డ్ కప్ తరువాత 2008 సీబీ సిరీస్, 2010 సిఎల్ టీ-20, 2010 ఆసియా కప్, 2011 ODI WC, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 సీఎల్ టీ -20,2016 ఆసియా కప్ ఇలా తన సారథ్యంలో టీం ఇండియా కు అనేక ట్రోఫీ లను సాధించి ICC ర్యాంకింగ్లో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు.

అటు ఇంటర్ నేషనల్ టోర్నీలలోనే కాదు ఇటు బీసీసీ నిర్వహించే ఐపీల్ వంటి దేశీయ మ్యాచ్ లలోను చెన్నై సూపర్ కింగ్స్ టీం కు సారథ్యం వహించిన ధోని CSK టీం కు 2010, 2018, 2021, 2023 లో 4 సార్లు ఐపీల్ విజేతగా టైటిళ్లు అందించారు.

Also Read – సిట్టూ…బిట్టూ వద్దట… ఎందుకు జగన్మావయ్యా?

అలాగే నేడు టీం ఇండియా మరో బ్యాట్స్ మాన్ కు అత్యంత కీలకమైన రోజు. నేడు సూర్య కుమార్ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సూర్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. 2021 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సూర్య కుమార్ యాదవ్ తన అద్భుత ఆట తీరుతో టీ -20 లలో వరల్డ్ నెంబర్ 1 మాట్స్ మాన్ గా ఎదిగారు.

ఆకాశమే హద్దుగా తన బాట్ కు పని చెపుతు బౌలర్లు కు చుక్కలు చూపిస్తారు సూర్య. దీనితో సూర్యను క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘SKY’ అంటూ పిలుచుకుంటారు. అలాగే టీ -20 లలో నాలుగు సెంచరీలు చేసి,రెండు సార్లు టీ- 20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు సూర్య కుమార్ యాదవ్.