74-Year-Old CM Chandrababu Naidu’s Energy Shocks All!

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు అయినా 15-20 ఏళ్ళ క్రితం ఏవిదంగా చురుకుగా ఉండేవారో నేటికీ అలాగే ఉన్నారు.

ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరిన సిఎం చంద్రబాబు నాయుడు, ఈ మండుటెండల్లో అందునా.. రోళ్ళు పగిలే ఉష్ణోగ్రతలు నమోదయ్యే కర్నూలులో పలు కార్యక్రమాలలో వరుసగా పాల్గొంటూనే ఉన్నారు.

Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?

ముందుగా ఉదయం 11.30 గంటలకు ‘స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర’ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.

అక్కడి నుంచి కర్నూలు సీ క్యాంప్ రైతు బజారులో పర్యటించారు. ముందుగా మరుగు దొడ్లను పరిశీలించి ఇలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. ఆ తర్వాత రైతుబజారు అంతా కలియ తిరుగుతూ రైతులతో మాట్లాడి ఇక్కడ సౌకర్యాలు, రాబడి వగైరా ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

Also Read – అమ్మ ఒడి..తల్లికి వందనం.బటన్ లేదా.?

భోజన విరామం తర్వాత జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యే ముందు మరికొందరు ముఖ్య నేతలతో సిఎం చంద్రబాబు నాయుడు సమావేశమై జిల్లా రాజకీయాల గురించి చర్చించారు.

సిఎం చంద్రబాబు నాయుడు వయసు గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలన్నా, ముందుగా “నేను యువకుడిని.. మరో 30 ఏళ్లు రాజకీయాలలో ఉండగల సత్తా ఉన్నవాడినని” గర్వంగా చెప్పుకునే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి తప్పక చెప్పుకోవాలి. జగన్‌ కనీసం వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేరు.

Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళలో ఎప్పుడూ జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజలు, పార్టీ శ్రేణుల మద్య ఎక్కువగా కనపడేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ ఈవిదంగా సామాన్య ప్రజలు వద్దకు వెళ్ళి మాట్లాడుతూ వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకొంటున్నారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ. కానీ జగన్‌ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రాణ భయంతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా తాడేపల్లి ప్యాలస్‌లోనే కాలక్షేపం చేస్తుంటారు.

ఆరోగ్యం విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కూడా సిఎం చంద్రబాబు నాయుడు దిగదుడుపే అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తే అనారోగ్యం పాలవుతుంటారు. సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం అమృతం తాగినట్లు ఇంత వయసులో కూడా ఎల్లప్పుడూ చాలా చలాకీగా ఉంటారు.

అంతేకాదు.. ఇంత వయసులో కూడా ఎప్పటికప్పుడు అందివస్తున్న టెక్నాలజీ గురించి అవగాహన ఏర్పరచుకొని, దానిని పాలనలో అమలుచేస్తుంటారు.

టెక్నాలజీ గురించి నాలుగు ముక్కలు మాట్లాడకపోతే నా ప్రసంగం పూర్తవదని ఆయనే చెప్పుకున్నారంటే అదంటే ఆయనకు ఎంత ఇష్టమో, ఎంత అవగాహన ఉందో అర్దం చేసుకోవచ్చు.