
దేశంలో రాజకీయ పార్టీలు ఒక్కోసారి ఆకాశమంత ఎత్తు ఎదిగిపోతుంటాయి. ఇక వాటికి తిరుగేలేదని అనుకుంటునప్పుడు హటాత్తుగా పాతాళంలోకి పడిపోతుంటాయి. ఇక ఎన్నటికీ కోలుకోలేవని భావిస్తున్నప్పుడు సరైన నాయకత్వం లభిస్తే మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుంటాయి కూడా.
ఇందుకు నిదర్శనంగా కాంగ్రెస్, బీజేపి, టీడీపీ, వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు కళ్ళ ముందే ఉన్నాయి. తాజాగా ఆమాద్మీ పార్టీ కూడా ఢిల్లీ ఎన్నికలలో ఓటమితో ఈ జాబితాలో చేరింది.
Also Read – సోము ‘శీల’ పరీక్ష కు సిద్దపడుతున్నారా.?
ఢిల్లీ గల్లీలో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమాద్మీ పంజాబ్ వరకు విస్తరించి అధికారం చేజిక్కించుకోగలిగింది. కానీ దాని ఢిల్లీ పునాదులు ఇప్పుడు దెబ్బ తిన్నాయి. కనుక దానిపై కట్టుకున్న పంజాబ్ కోటని కూడా బద్దలుకొట్టి కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపి అధిష్టానం అప్పుడే పావులు కదుపుతోంది. అయితే దాని కోసం అది అమెరికా బాణాలు ఉపయోగించుకోవడం విశేషం.
అమెరికాలోని ఆక్రమ వలసదారులని మిలటరీ విమానాలలో భారత్ తీసుకువచ్చి పంజాబ్‌లో రాజధాని అమృత్‌సర్ విమానాశ్రయంలో దింపేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read – హస్తినలో అరకు కాఫీ ఘుమఘమలు
దీనిపై పంజాబ్‌లో అధికార ఆమాద్మీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇన్ని విమానాశ్రయాలు ఉండగా అమృత్‌సర్‌లోనే ఎందుకు దించుతున్నారు?ఇది ఖచ్చితంగా బీజేపి కుట్రలో భాగమే.
ఈవిదంగా చేయడం తద్వారా అక్రమ వలసలు వెళ్ళినవారందరూ పంజాబ్‌కి చెందినవారేననే భావన కల్పించి, తమా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
Also Read – చంద్రబాబుని చూపిస్తా.. సెంటిమెంట్ రగిలిస్తా!
ఒకప్పుడు దేశానికి అన్నదాతగా, లక్షలాది మంది వీర సైనికులను అందించే రాష్ట్రంగా పేరు పొందిన పంజాబ్‌లో గత రెండు దశాబ్ధాలుగా మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిపోయింది.
అమెరికాలో ‘గన్ కల్చర్’ని ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేకపోతున్నట్లే, పంజాబ్‌లో మాదక ద్రవ్యాల మాఫియాని ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేకపోతోంది. పంజాబ్‌ని పట్టి పీడిస్తున్న ఈ మాదక ద్రవ్యాల మాఫియాని ఉక్కుపాదంతో అణచివేస్తామనే హామీతోనే ఆమాద్మీ అధికారంలోకి వచ్చింది. కానీ కట్టడి చేయలేకపోయింది.
ఈ కారణంగా పంజాబ్‌లో అరాచక పరిస్థితులు నెలకొని నానాటికీ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఇదీగాక పంజాబ్ ప్రజలకు మొదటి నుంచి అమెరికా, కెనడాలపై చాలా మోజు కూడా ఉంది. కనుక పంజాబ్ నుంచి ఆ రెండు దేశాలకు సక్రమంగా, అక్రమంగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు అమెరికా మిలటరీ విమానాలలో వారిని తీసుకువచ్చి అమృత్‌సర్‌లో దించి వెళుతుండటంతో ఈ అపకీర్తి అధికారంలో ఉన్న ఆమాద్మీ ప్రభుత్వానికే చుట్టుకుంటుంది… అని భయపడుతున్నారు.
కనుక ఈవిదంగా తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుజేసి దెబ్బ తీయాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆమాద్మీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్రం ఈ వాదనలు ఖండిస్తోంది. కానీ ఢిల్లీ తర్వాత తమ తదుపరి లక్ష్యం పంజాబ్ అని బీజేపి నేతలు చెపుతున్నారు కనుక ఆమాద్మీ వాదనలు పూర్తిగా కొట్టిపడేయలేము కూడా.