2016 లో కన్నడ భాష లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ అనే చిత్రం తో సౌత్ ఇండియా మొత్తం తన పేరును తెలుసుకునేలా చేసుకుంది ‘రష్మిక మందన’. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఆ సినిమాలో హీరోయిన్లలో మెయిన్ లీడ్ గా చేసారు రష్మిక. ఇక, అదే ఊపులో తెలుగింట కూడా అడుగు పెట్టేసారు.

వెంకీ కుడుములు దర్శకత్వం లో నాగ శౌర్య సరసన ‘ఛలో’ తో తెలుగునాట పరిచయం అయ్యారు రష్మిక. ఇక అప్పటినుండి ఆమె వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రతి ఏటా ఒక బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ లో తన హవా సాగిస్తుంది ఈ అమ్మడు. అదే ఏట ‘గీత గోవిందం’ తో విజయ్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

ఇక ఈ సినిమా ఫామిలీ ఆడియెన్స్ మనసు దోచి బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవ్వటం తో విజయ్ తోనే మరల ‘డియర్ కామ్రేడ్’ అంటూ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక 2020 తన కెరీర్ లో నే గుర్తిండిపోయే సంవత్సరం అయింది.

సూపర్ స్టార్ మహేష్ సరసన నటిస్తూ వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరూ’ కలెక్షన్ల వర్షం కురపగా, మరల వెంకీ కుడుములు దర్శకత్వం లో నితిన్ కు జోడిగా వచ్చిన ‘భీష్మ’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక అదే ఊపులో అదే ఏట సుక్కు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ లో హీరోయిన్ క్యారెక్టర్ కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప కేవలం తెలుగునాటే కాక, మొత్తం భారత దేశం లో విస్తృతమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది. పాన్-ఇండియా హీరోయిన్ గా నేషనల్ క్రాష్ గా మారిపోయారు రష్మిక. ఇక అప్పటినుండి ప్రతి డిసెంబర్ నెల తనకు ఒక బ్లాక్ బస్టర్ ను తెచ్చిపెడుతుంది.

21 లో పుష్ప సెన్సషన్ సృష్టించగా, 23 లో రన్బీర్ జంటగా ‘యానిమల్’ అంటూ వచ్చి కలెక్షన్ల సునామి ను మరోసారి చూసింది రష్మిక. కేవలం సినిమా లో క్యారెక్టర్ గా కాక తన యాక్టింగ్ తో అటు అభిమానులను మెప్పించింది. ఇటు విమర్శకుల ప్రసంసలు దక్కించుకుంది. ఇక ఈ ఏడు డిసెంబర్ కు ‘పుష్ప-ది రూల్’ తో రష్మిక నేషనల్ క్రష్ నుండి ఇంటర్ నేషనల్ క్రష్ గా మారిపోయిన ఆశ్చర్య పడాల్సిన పని లేదు.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?


ఇంత మంచి రికార్డు తో ఉన్న రష్మిక కు లైన్-అప్ కూడా సాలిడ్ గానే కనపడుతుంది. ధనుష్ సరసన ‘కుబేర’, యానిమల్ కు సీక్వెల్ ‘యానిమల్ పార్క్’, ‘పుష్ప-ది రాంపేజ్’, ‘గర్ల్ ఫ్రెండ్’ అంటూ స్టాండ్- అలోన్ చిత్రం తో పాటు బాలీవుడ్ లో పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అలాగే 2025 లో కూడా డిసెంబర్ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ శ్రీవల్లి, గీతాంజలి మాదిరి మరో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అందుకుంటుందేమో చూడాలి.