YCP TDP

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఒక మహిళ సాక్ష్యాలతో కూడిన ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చింది. అయితే దీని మీద వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సదరు ఎమ్మెల్యే ను తక్షణమే వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసారు.

అలాగే ఇటువంటి నాయకులు పార్టీకి, ప్రభుత్వానికే మాయని మచ్చ తెస్తారు అనే ఉద్దేశంతో వెంటనే ఆదిమూలం ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని నిరూపించుకున్నారు చంద్రబాబు.

Also Read – కిల్ బిల్ పాండ్య’..!

అయితే టీడీపీలో నాయకుల మీద ఆరోపణలు వచ్చిన మరుక్షణమే ఆయన ఎమ్మెల్యే నా, ఎమ్మెల్సీ నా అని ఆలోచించకుండా, అవి వీడియో లు, విపక్షల కుట్ర అంటూ కట్టు కథలు చెప్పకుండా వెంటనే సదరు నిందితుడి పై సస్పెన్షన్ ప్రకటనతో ఆదేశాలు జారీ చేసి మహిళల పట్ల తనకు, తన పార్టీకి ఉన్న గౌరవాన్ని చాటిచెప్పారు.

మరి వైసీపీలో ఇటువంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతల మీద కానీ, హత్య ఆరోపణలు మోస్తున్న నాయకుల మీద కానీ జగన్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు సరికదా అటువంటి నాయకులను తన పక్కన పెట్టుకుని వీరు సౌమ్యులు, చాలా మంచి వాళ్ళు , చిన్న పిల్లాడు అంటూ వారికి వత్తాసు పలుకుతూ ప్రజల ముందుకొచ్చారు.

Also Read – ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఆంధ్రా వద్దు.. తెలంగాణ ముద్దు!

ఇక ఎన్నికల తరువాత బయటకొచ్చిన వైసీపీ నేతల భాగోతాల మీద కూడా జగన్ ఎన్నడూ స్పందించలేదు, అలాగే పార్టీ తరుపున ఎటువంటి చర్యలకు ఆదేశించలేదు. విలువలు, విశ్వసనీయత అంటూ మీడియా ముందు కబుర్లు చెప్పే జగన్ అదే మీడియాకెక్కిన వైసీపీ నేతల విలువలు ఏపాటివో తెలుసుకోలేకపోతున్నారా.?

సాక్ష్యాలతో సహా అడ్డంగా బుక్కైన నేతలను సైతం జగన్ ఉపేక్షిస్తున్నారు అంటే వైసీపీ పార్టీకి ఇటువంటి నేతలే అవసరమని జగన్ చెప్పదలచుకున్నారా.? లేక జగన్ వెంట కలిసి నడవాలి అంటే మినిమం ఈ స్థాయి ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనా.? అని వైసీపీ భావిస్తుందా.

Also Read – ఏపీకి, టిడిపికి వైసీపి చాలా అవసరమే!

విలువలు లేని నాయకులతో విశ్వసనీయత లేని రాజకీయం చేస్తున్న జగన్, విలువలతో కూడిన రాజకీయాలతో విశ్వసనీయంగా పని చేస్తున్న బాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కూడా పాత పంచాయితీనేనా అన్నట్లుగా దువ్వాడ వాణి, మాధురిల వివాదం మరోసారి మీడియాకెక్కింది.

ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న దువ్వాడ ఇంటి రామాయణం మళ్ళీ వార్తలలోకి వచ్చింది. దువ్వాడ ఉంటున్న ఇంట్లోకి మాదిరి తిరిగి అడుగు పెట్టడంతో ఈ పాత పంచాయితీ మళ్ళీ కొత్తగా బయటకొచ్చింది. మాధురి దువ్వాడ నివాసంలో ఉంటుంది అన్న సమాచారం తెలుసుకున్న దువ్వాడ వాణి , ఆమె కుమార్తెలు దువ్వాడ నివాసం దగ్గరకు చేరుకున్నారు.

దీనితో ఈ ట్రై యాంగిల్ వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. ఒక నాయకుడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటు రోజు మీడియాలో రచ్చ చేస్తుంటే కూడా జగన్ ఇటువంటి వారి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్కిస్తూ, పాస్ పోర్ట్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతూ, వరదలలో బురద రాజకీయాలు చేస్తున్నారు.

ముందుగా తన పార్టీకి అంటిన ఈ బురదను కడుక్కుని ఆ తరువాత ఎదుట వారి పై బురద జల్లితే కనీసం ప్రజలలో వైసీపీ పట్ల ఒక విలువ జగన్ పట్ల ఒక విశ్వసనీయత ఉంటుంది.