amaravati-farmers-at-jagan-house

ఈ 5 ఏళ్ళుగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తాడేపల్లి ప్యాలస్‌కు కూతవేటు దూరంలో టెంట్లు వేసుకొని ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ తమ గోడు వినిపించుకోకపోవడంతో పాదయాత్రలు చేసి తిరుమల వెంకన్నకు, బెజవాడ కనకదుర్గమ్మకు మొరపెట్టుకున్నారు.

Also Read – కండువాలున్నాయా… ఉంటే మేము వచ్చేస్తాం!

జగన్‌ కళ్ళు తెర్పించాలని అరసవెల్లి సూర్యనారాయణ మూర్తికి కూడా విన్నవించుకోవడానికి బయలుదేరితే దారి పొడవునా వైసీపి గూండాల చేత దాడులు చేయిస్తూ, పోలీసుల చేత అడ్డగిస్తూ వెనక్కు తిరిగిపోయేలా చేశారు.

రాజధాని కోసం వారు తమ జీవనోపాది కల్పించే వ్యవసాయ భూములను ఇచ్చేస్తే, జగన్‌ తాను ఒకవేళ అధికారం కోల్పోయినా అమరావతి మాత్రం ఏర్పడకూడదనే దురాలోచనతో వారిచ్చిన భూములను పట్టాలు వేసి పంచేసి ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించారు. ఇది అందరికీ తెలిసిన సమకాలీన చరిత్ర.

Also Read – బాక్సాఫీస్ ముంగిట “దేవర” డ్యాన్స్ వేయాల్సిందే!

ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేయాలనుకున్న టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. తమకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అమరావతి రైతులు చాలా సంతోషిస్తూ తమ ఆందోళనలను విరమించారు. అయితే వారు చంద్రబాబు నాయుడు కంటే ముందుగా జగన్మోహన్‌ రెడ్డిని అభినందించడానికి బయలుదేరడం విశేషం.

కొంతమంది రైతులు పూల బొకేలు, అరటిపళ్లు తీసుకొని నిన్న తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌ని కలిసేందుకు వెళ్లారు. కానీ అక్కడ పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కు తిప్పి పంపించేశారు.

Also Read – నాకు కష్టం వచ్చింది.. అందరూ రండి!

“జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగూ మమ్మల్ని ఈ పొలిమేరకు కూడా రానీయలేదు. కనీసం ఇప్పుడైనా పులివెందులలో ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయనను అభినందించేందుకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని వారు ప్రశ్నించారు.

ఇలాంటి జగన్‌ బాధితులు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. ప్రభుత్వోద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, బిల్లులు రాక అధికారులు చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఇంకా చాలా మందే ఉన్నారు. పోలీసులు అనుమతిస్తే వారందరూ కూడా వచ్చి జగన్‌ను పలకరించడానికి ‘సిద్దం’గా ఉన్నారు.

కానీ ‘నా బీసీలు, నా ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల తరపున పోరాడేందుకు ‘సిద్దం’గా ఉన్నానని చెపుతున్న జగన్‌ తనను అభినందించేందుకు వచ్చేవారిని కలిసేందుకు ఎందుకో ‘సిద్దం’గాలేరు.