Amaravati Vs YSR Congress Party Story

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పై వైసీపీ చేస్తున్న రాజకీయం నానాటికి పరిధి దాటుతుంది. కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టి ఏడాది పూర్తి కావడంతో అమరావతికి పట్టిన వైసీపీ గ్రహణం వీడి కూడా ఒక వసంతం పూర్తయ్యింది.

దీనితో అమరావతి vs వైసీపీ గా సాగుతున్న వైకుంఠపాళి ఆటలో ఇప్పుడు ఎవరు పై చేయి సాధించారో చూద్దాం. రాష్ట్ర విభజనతో ఏపీకి మొదలైన ఈ రాజధాని సమస్య విభజన పూర్తయ్యి 11 ఏళ్ళు గడిచినా వైసీపీ తన రాజకీయంతో రాష్ట్రంలో ఇంకా నిప్పు రాచేస్తూనే ఉంది.

Also Read – హిందీ భాష పై బాబు స్పందన…

ఇది వైసీపీ విజయంగా భావించాలో, లేక అమరావతికి శాపంగా పరిగణనించాలో అర్ధం కానీ స్థితిలో ఆంధ్రప్రదేశ్ తన గుర్తింపు, గౌరవం కోసం ఇప్పటికి వైసీపీ రాజకీయంతో అలుపెరుగని యుద్ధం చేస్తూనే ఉంది. తాజాగా అమరావతి పై సాక్షి మీడియాలో జరిగిన చర్చే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

అమరావతి ‘వేశ్యల నగరం’ అంటూ సాక్షి రేపిన రాజకీయ చిచ్చు కి సజ్జల తన ‘సంకర తెగ’ వ్యాఖ్యలతో పెట్రోల్ పోశారు. దానికి వైస్ జగన్ పొదిలి పర్యటన కారం రాసింది. ఇలా ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి అని దేశం మొత్తం గుర్తించే సమయానికి గౌరవించే స్థాయికి అమరావతి చేరుకుంటున్న ప్రతి సారి వైసీపీ అమరావతి పై ఇదే తరహా రాజకీయ రచ్చ చెయ్యడం, ఆ తరువాత అమరావతి పై ఎన్నో అనుమానాలు రావడం పరిపాటిగా మారుతుంది.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

ఒక బిడ్డకు జన్మ నివ్వడానికి కూడా తల్లికి 10 నెలల సమయం సరిపోతుంది. అటువంటిది ఒక రాష్ట్ర రాజధానిగా అమరావతికి జన్మనివ్వడానికి ఆంధ్రప్రదేశ్ 11 ఏళ్లుగా పురిటి నొప్పులు మోస్తూనే వస్తుంది. ఇందుకు వైసీపీ భారీ మూల్యం చెల్లించినప్పటికీ తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు.

మూడు రాజధానుల కథతో పాలన మొదలుపెట్టిన వైసీపీ అమరావతి టూ విశాఖపట్నం సుమారు 400 కిమీ ప్రయాణానికి దాదాపు 5 ఏళ్ళ సమయం తీసుకుంది. అయినా చివరికి అధికార వైసీపీ తన హయాంలో గమ్యస్థానానికి చేరుకోలేకపోయింది. అలాగే ఇప్పుడు తాడేపల్లి టూ అమరావతి దాదాపు 40 కిమీ ప్రయాణానికి మరో ఐదేళ్లు పోరాటం చేయడానికి వైసీపీ సిద్దపడింది.

Also Read – భువి నుంచి దివికి ఒక తార.. దీవి నుంచి భువికి మరో తార!

ఇందులో భాగంగా వైసీపీ ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా, జగన్ నుంచి బొత్స వరకు, కొమ్మినేని నుంచి కృష్ణంరాజు వరకు ఎంతమంది అమరావతి పై ఎన్ని నిందలు మోపినా రాజధాని నిర్మాణాలను ఆపలేకపోతున్నారు. అమరావతి అభివృద్ధికి అడ్డుకట్ట కట్టలేకపోతున్నారు.

నాడు స్మశానం అంటూ మొదలు పెట్టిన వైసీపీకి నేడు వేశ్యల నగరం అంటూ సాక్షి వంతపాడుతూ అమరావతి పై విషం చిమ్ముతూనే ఉంది. అయితే దేశంలో ఏ రాష్ట్ర రాజధాని పై ఏ ప్రతిపక్ష పార్టీ చేయనంత నీచ రాజకీయం వైసీపీ చేస్తుంటే, అందుకు సాక్షి తనవంతు సాయం అందించడం కొసమెరుపు.

అయితే ఇక్కడ అమరావతి పై వైసీపీ ఎంత మొండిగా, మూర్కంగా ముందుకెళ్తుందో అమరావతి కూడా అంతే నిబ్బరంగా, అంతే ధృడంగా తన స్థిరత్వాన్ని చాటిచెప్పడానికి, వైసీపీ రెక్కలు విరవడానికి ఎన్ని అవమానాలనైనా భరించడానికి, ఎన్ని అవహేళనైనా తట్టుకోవడానికి, ఎన్ని కుట్రలకైనా ఎదురీదడానికి, చివరికి ఎన్ని నిందలైన మోయడానికి సిద్దపడింది.




చివరికి తన సంకల్పంతో అమరావతి వైసీపీ ని పాతాళానికి నెట్టింది, తన ఉనికిని నిలబెట్టుకుంది. ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర రాజధానిగా ఐదేళ్ల తన అజ్ఞాతవాసాన్ని ముగించుకుని ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి బాబు నాయకత్వంలో వైసీపీ సాక్షిగా రాజధానిగా అమరావతి పట్టాభిషేకం జరుపుకుంది. దీని బట్టి చూస్తే ఈ అమరావతి vs వైసీపీ కథా చిత్రంలో గెలిచిందెవరో అర్దమయ్యిందా రాజా.!