
పిఠాపురం జనసేన సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకొని, నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీడీపీని కూడా గెలిపించమని చెప్పుకోవడాన్ని చాలామంది తప్పు పట్టారు. టీడీపీ మద్దతుదారులు సరేసరి. ఇప్పుడు వైసీపీ కూడా తప్పు పట్టింది.
వైసీపీలో కాస్త నోటి పదును ఉన్న నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ మాట్లాడితే తమ పార్టీ వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిందని గొప్పగా చెప్పుకుంటారు. కానీ టీడీపీ, బీజేపిలు మద్దతు ఇచ్చినందునే జనసేన గెలిచింది తప్ప దాని సొంత బలంతో గెలవలేదు.
Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
పైగా మా వైసీపీ వదిలేసినవాళ్ళు, టీడీపీ సూచించిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని అభ్యర్ధులుగా పోటీ చేయించారు తప్ప ఆ 21 మందిలో ఒకరిద్దరు తప్ప అసలు సిసలు జనసేన నేతలు ఎంతమందున్నారు?
వేరే పార్టీల నుంచి వచ్చినవారితో టీడీపీ, బీజేపిల మద్దతుతో 21 సీట్లు గెలుచుకుని వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిందని గొప్పగా చెప్పుకోవడం వాపుని చూసి బలుపు అనుకోవడమే అవుతుంది కదా?
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
మీ సొంత బలంతో గెలవలేనప్పుడు వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచామని గొప్పలు చెప్పుకోవడం దేనికి పవన్ కళ్యాణ్‌గారు?” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
వైసీపీలో ఉన్నవాళ్ళందరూ ఆ పార్టీలో పుట్టి పెరిగినవారు కారనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన చేసినందుకు ఏపీ కాంగ్రెస్ నేతలందరూ ప్రజాగ్రహానికి భయపడి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా కనబడుతున్న వైసీపీలో చేరిపోయారు.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
వారినందరినీ వెనక్కు తెచ్చుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది కదా?
కానీ ఆమె వారికి నమ్మకం కలిగించలేకపోవడం వలననే వైసీపీ ఓడిపోయినప్పటికీ వారు జగన్‌ని అంటిపెట్టుకొని ఉండాల్సి వస్తోంది. ఒకవేళ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 15-20 సీట్లు గెలుచుకున్నా ఈపాటికి వైసీపీ ఖాళీ అయిపోయి ఉండేదేగా!
ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికలలో మూడు పార్టీలు కలిసినందునే భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చాయనేది వాస్తవం. కనుక జనసేన గెలుపుకి ఈ పొత్తులే కారణం తప్ప సొంత బలం కానే కాదు.
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే తమకు లాభాలు వస్తాయని నిశితంగా పరిశీలించి పెట్టుబడులు పెడుతుంటారు తప్ప గుడ్డిగా పెట్టరు.
అదేవిదంగా రాజకీయ నాయకులు కూడా పార్టీల విజయావకాశాలను బేరీజు వేసుకొని గెలిచే అవకాశం ఎక్కువ ఉన్న పార్టీలలో వచ్చి చేరుతుంటారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలలో తమ విజయావకాశాలు మెరుగుపరుచుకోవడం కోసం ఇతర పార్టీలలో బలమైన నేతలను ఆకర్షించి తెచ్చుకుంటాయి.
ఈ లెక్కలు, పొత్తులు, సమీకరణాలు అన్నీ సరిగ్గా కుదిరితే విజయం సాధిస్తుంటాయి. కనుక ఏదో ఓ కారణం చేత గెలిచామని లేదా ఓడిపోయామని చెప్పుకోవడం సరికాదు. వైసీపీకైనా జనసేనకైనా ఇదే వర్తిస్తుంది.
అయితే అంబటి రాంబాబు మాటల్లో పవన్ కళ్యాణ్ విమర్శలకు ధీటుగా జవాబు చెపుతూనే, “నీకంత సీన్ లేదు.. దమ్ముంటే నిరూపించుకో..” అని సవాలు విసిరిన్నట్లే భావించవచ్చు. అంటే కూటమి నుంచి బయటకు వచ్చి నిరూపించుకోమన్న మాట!
అంబటి రాంబాబు తాజా వ్యాఖ్యలతో కూటమిని చీల్చేందుకు వైసీపీ పట్టువదలని విక్రమార్కుడులా ప్రయత్నిస్తూనే ఉందని స్పష్టమవుతోంది.