ambati-rambabu-chandrababu-over-polavaram-project

అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు పైన ఓ మెతుకు పట్టుకుని చూస్తే తెలుస్తుంది. అలాగే జగన్‌ ప్రభుత్వంలో మంత్రులకు వారి శాఖలపై ఎంత అవగాహన ఉందో తెలుసుకోవాలంటే, మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పిన తాజా మాటలు వింటే అర్దమవుతుంది.

చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 5-10 శాతం పనులే చేసిందని, తాము రివర్స్ గేర్ వేసి శరవేగంగా పనులు ముందుకు నడిపించామని జగన్‌ గొప్పలు చెప్పుకునేవారు. కానీ ఆయన ప్రభుత్వంలోనే జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించిన అంబటి రాంబాబు ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అప్పుడే చేతులెత్తేశారు.

Also Read – నాకు కష్టం వచ్చింది.. అందరూ రండి!

ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ఈ 5 ఏళ్ళలో జరిగిన పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కన పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబటి రాంబాబుకి ఆ మాత్రం చాలు అల్లుకుపోవడానికి. ఆయన అన్న ఈ ఒక్క ముక్కని పట్టుకొని ఏమన్నారంటే, “నేను ఆ రోజు ఏం చెప్పానో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెపుతున్నారుగా? ఆయన కొత్తగా ఏం చెప్పారు?

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

నేను ఆనాడే పోలవరం పర్యటించి అక్కడి పనులను పరిశీలించి, ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడాను. అప్పుడే నాకు ఓ విషయం అర్దమైంది. పోలవరం చాలా సంక్లిష్టమైనదని. ఇది నాక్కొడా అర్దం కాదని. ఇంతకీ దానిలో అంత అర్ధం కానిదీ ఏంటి? అంటే అది నాకు అర్దం కాలేదు. కనుక దాని గురించి నాకే అర్దం కాన్నప్పుడు ఎవరికీ అంత సులువుగా అర్దం కాదు,” అని చాలా స్పష్టంగా తన తన అవగాహనారహిత్యాన్ని స్వయంగా అంబటి రాంబాబు చెప్పుకున్నారు.

జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించిన అంబటి రాంబాబుకి తన శాఖలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన లేదని ఇంత నిసిగ్గుగా చెప్పుకోవడం విశేషమే కదా?అయితే ఆయనకు ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే కాదు… బహుశః రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు గురించి కూడా అవగాహన ఉండి ఉండదు.

Also Read – పాపం కేటీఆర్‌… కాంగ్రెస్‌కి దొరికిపోయారుగా!

ఇంత ఫ్రీ టైమ్ ఉండబట్టే తన పూర్తి సమయాన్ని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను అవహేళన చేయడానికి, గంటా అరగంటా చొప్పున కేటాయిస్తుండేవారేమో? సత్తెన్నపల్లిలో రోడ్లపై డ్యాన్సులు చేసేవారేమో?

అయితే జగన్‌ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు చాలా మందే ఉన్నారని అందరికీ తెలుసు. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరమే లేదని సంక్షేమ పధకాలే చాలానే కోడి-గుడ్డూ అంటూ కధలు చెప్పే మంత్రి ఒకరు కాగా పర్యాటక మంత్రి అంటే నెలకు మూడు నాలుగుసార్లు తిరుమల శ్రీవారిని, తాడేపల్లి ప్యాలస్‌ శ్రీవారిని దర్శించుకోవడమే అనుకునే మంత్రి మరొకరు. బుద్ధిగా మద్యం వ్యాపారాలు చేసుకోవడమే తప్ప మరొకటి తెలీని మంత్రి మరొకరు… బూతుల మంత్రి మరొకరు. ఒకరు రోడ్లపై చొక్కాలు చించుకుంటే, మరొకరు భూకబ్జాలు, ఇసుక తవ్వకాల స్పెషలిస్ట్! తమ శాఖల గురించి అవగాహన తప్ప ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో స్పెషాలిటీ!