ambati-rambabu Sankranthi Wishes

సంక్రాంతికి భోగీ మంటలు ఎంత కామనో, సత్తెనపల్లి లో అంబటి డాన్స్ లు అంతే కామన్ అన్నట్టుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు…ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంబరాల రాంబాబుగా ఫ్యామస్ అయ్యారు.

అయితే నాడు గెలుపు మీదున్న రాంబాబు వీధి నాట్యాలు చేస్తూ ఆనందంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోగా నేడు ఓటమి భారంతో సోషల్ మీడియాకి పరిమితమై సంక్రాంతి శుభాకాంక్షల సందేశంతో సరిపెట్టారు.

Also Read – వైసీపీ ఓటమికి మరో కారణం.. నిజమా?

దీనితో ఆనాటి అంబటి గారి సంబరాలు ఈనాడు ఎటుపోయాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే గెలిచినా, ఓడినా అది కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలి గాని ఇలా పండుగ వేడుకలను అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా అధికారంలో లేనప్పుడు మరో మాదిరిగా జరుపుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు సత్తెనపల్లి ప్రజలు.

ఓటమి భారంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉండడంతోను, వైసీపీ కార్యకర్తల పై ప్రభుత్వ వేధింపులతోను సంబరాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఆ ఆనంద తాండవాన్ని, భోగి మంటలను మిస్ అవుతున్నందుకు తనకు ఎంతో బాధగా ఉందని, అయినా తప్పడం లేదంటూ తన సోషల్ మీడియాలో సత్తెనపల్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు మాజీ మంత్రి.

Also Read – చంద్రబాబు చేయలేకపోయారు… జగన్‌ చేస్తున్నారు?


అయితే అంబటి విడుదల చేసిన వీడియో మీద కూడా సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి. ఓటమి తో అదుపులో పెట్టుకోవాల్సిన నోరు అదుపులో పెట్టుకోకుండా పండుగ వేడుకలను అదుపు చేసుకోవడం అంబటి అవివేకమే అవుతున్నదని, గెలిస్తేనే వీరికి ప్రజలు, పండుగలు గుర్తుకొస్తాయి. అదే ఓడితే ఇలా నియోజకవర్గ ప్రజలను తప్పించుకుని సోషల్ మీడియా సందేశాలతో సరిపెడతారా అంటూ నినదిస్తున్నారు.