Anchor Shyamala

వైసీపి అధికార ప్రతినిధిగా యాంకర్ అరె శ్యామలని నియమించడంతో అందరూ ఆమె దశ తిరిగిపోయిందని, పార్టీలో సీనియర్ నేతలతో సమానంగా గౌరవం లభించిందని పొగుడుతున్నారు. జనరల్‌గా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కానీ వైసీపిలో ఆ పదవులలో లేదా అంబటి రాంబాబు, కొడాలి నానిలా అనధికారంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినవారి పరిస్థితితో బేరీజు వేసుకొని చూస్తే, జగన్‌ ఆమె నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టారని చెప్పక తప్పదు.

ఇంతకాలం వైసీపి ప్రభుత్వంలో, పార్టీలో ఓ వెలుగు వెలుగుతూ, చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇప్పుడు ఎటువంటి గౌరవం లభిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు.

Also Read – అప్పుడు బిఆర్ఎస్ మౌనం… ఇప్పుడు టిడిపి!

అలాగే జగన్‌ని చూసుకొని పెట్రేగిపోయిన పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మ ఎందుకు సైలైంట్ అయిపోయారో అందరికీ తెలుసు. ముఖ్యంగా పోసానికి వైసీపిలో పనిలేక, సినీ ఇండస్ట్రీలోకి తిరిగి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు.

రోజా కూడా నోటి దురద వలననే ఎన్నికలలో ఓడిపోయారనే సంగతి అందరికీ తెలుసు. అయితే ‘కర్మఫలం’ ఆమె ఇంకా అనుభవించాల్సి ఉంది. అందుకు కేసులు రెడీ అవుతున్నాయి. అయితే ఇటువంటి కష్టానష్టాలను భరించగల ఆర్ధికస్తోమత, మనోబలం ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. కనుక వైసీపి ఓడిపోయినా ఆమె ‘జబర్దస్త్’గానే ఉన్నారు.

Also Read – టాలీవుడ్‌ హీరోలూ… మీకూ సిన్మా చూపిస్తాం రెడీయా?

ఆమె ‘ఫైర్ బ్రాండ్’ అంటే తెలుగులో ‘నోటి దురద ఎక్కువగా ఉన్నవారు’ కనుకనే జగన్‌ ఆమెకు ఆ పదవి కట్టబెట్టారు. ఆ నోటి దురద వలననే ఎన్నికలలో ఓడిపోయిన ఆమెకు మళ్ళీ నోటి దురద ప్రదర్శించాల్సిన ఈ పదవి కట్టబెట్టడం అంటే ఆమె రాజకీయ జీవితానికి ఆమె నోటితోనే సమాధి కట్టించడంగానే భావించవచ్చు.

ఈ నేపధ్యంలో శ్యామలకి వైసీపి అధికార ప్రతినిధి పదవి ఎంతమాత్రం బంగారు కిరీటం కాబోదు ముళ్ళ కిరీటమే అవుతుంది.

Also Read – సనాతన ధర్మం ఒకే… రాజకీయాలు నాట్ ఒకే!

ఆమెకు టీవీ, సినీ రంగాలు పునాదిగా ఉన్నాయి. ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలే చాలు… ఆమె కెరీర్‌ దెబ్బ తినడానికి. ఇప్పుడు ఆమె మాట్లాడబోయే మాటలతో ఆ పునాదులను తానే దెబ్బ తీసుకునే ప్రమాదం ఉంటుంది.

అలాగని ఆమె నష్టపోతే ఆ లోటు, నష్టాన్ని భర్తీ చేయడానికి వైసీపి ఇప్పుడేమీ అధికారంలో లేదు. వైసీపిపై మండిపోతున్న టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందిప్పుడు. కనుక శ్యామల అత్యుత్సాహంతో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేసి తర్వాత ‘అరె’ అనుకోవడానికి అవకాశం కూడా ఉండదు.

ఏది ఏమైనప్పటికీ అందమైన యాంకర్ నెత్తిన ఈ ముళ్ళ కిరీటం పెట్టి, అదో గొప్ప పదవి, గౌరవం అని భ్రమింపజేయడం జగన్‌కే చెల్లు. కనుక ఆమె ఆ ముళ్ళు తనకి గుచ్చుకోకుండా, తమ ప్రత్యర్ధులకి ఇబ్బంది కలగకుండా ఎలా బ్యాలన్స్ చేస్తారో?