ap-advisors

అధికార పార్టీలలో రాజకీయ నిరుద్యోగుల కోసం సృష్టించిన ఉద్యోగాలే ప్రభుత్వ సలహాదారులు.. అని చెప్పొచ్చు. జగన్‌ హయంలో సుమారు 50 మందికి పైగా సలహాదారు ఉద్యోగాలు కల్పించి వారికి వందల కోట్లు జీతభత్యాలు చెల్లించారు.

కానీ రాష్ట్ర విభజనతో ఇంకా చిన్నదైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ‘ఒకటి సరిపోదు మూడు రాజధానులు అవసరమనే’ గొప్ప విషయం కనిపెట్టిన మేధావి జగన్‌. కనుక ఆయనకి వారి సలహాలు అవసరమే లేదు. వారిలో పోసాని వంటివారిని ఏవిదంగా వాడుకున్నారో అందుకు ఆయన ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

ప్రభుత్వానికి సలహాదారులంటే ఈవిదంగా ఉండాలని నిరూపించి చూపారు సిఎం చంద్రబాబు నాయుడు. వివిద రంగాలలో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ప్రభుత్వ సలహదారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సుచిత్ర ఎల్ల: భారత్‌ బయోటెక్ ఎండీ, సోమనాధ్: ఇస్రో మాజీ ఛైర్మన్‌, డాక్టర్ కేపీసీ గాంధీ; ఫోరెన్సిక్ శాస్త్రవేత్త, సతీష్ రెడ్డి: డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌, కేంద్ర రక్షణశాఖ సలహాదారు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

వీరు నలుగురూ క్యాబినెట్ హోదాతో రెండేళ్ళపాటు ప్రభుత్వానికి సలహాదారులుగా వ్యవహరిస్తారు. వీరి బాధ్యతలు ఏవంటే…

సోమనాధ్: వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, అర్బన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీలు తదితర రంగాలలో స్పేస్ టెక్నాలజీని ఏవిదంగా వినియోగించుకోవాలో సలహాలు ఇస్తారు. ఏఐ ఆధారిత స్పేస్ ఎనలిటిక్స్, జీపీఎస్, శాటిలైట్ నావిగేషన్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రం ఏవిదంగా వినియోగించుకోవచ్చో సూచిస్తారు.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

సుచిత్ర ఎల్ల: రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల మహిళలు, మహిళా కళాకారులకు ప్రభుత్వం ఏవిదంగా తోడ్పడవచ్చో సూచిస్తుంటారు. చేనేత, హస్తకళలు, డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ విషయంలో అవసరమైన సలహాలు ఇస్తారు.

సతీష్ రెడ్డి: రాష్ట్రంలో ఏరో స్పేస్, డీప్ టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇస్తారు.

డాక్టర్ కేపీసీ గాంధీ: రాష్ట్రంలో అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్‌ స్థాపనకు తోడ్పడతారు. అత్యాధునిక విధానాలతో నేరస్థుల ఫోరెన్సిక్ రికార్డులు ప్రొఫైలింగ్ చేయడం, ఈ రంగంలో యూనివర్సిటీలు కోర్సులు రూపకల్పన, శిక్షణలో తోడ్పడతారు. ఈ రంగంలో అంతర్జాతీయస్థాయిలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి దానిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వినియోగించుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, ఏర్పాట్లకు తోడ్పాటు అందిస్తారు.




జగన్‌ ప్రభుత్వంలో సజ్జల, పోసాని వంటి సలహాదారులకు, ఈ నలుగురు సలహాదారులకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్‌ హయంలో సలహాదారులు వైసీపీ కోసమే పనిచేశారు తప్ప ప్రభుత్వం, రాష్ట్రం కోసం కానేకాదు. కానీ ఈ నలుగురు తమతమ రంగాలలో చాలా నిష్ణాతులు కనుక వారి సేవలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చాలా అమూల్యమైనవి. వారి సలహాలు, తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా చాలా మేలు కలుగుతుంది.