
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానిలో కేటాయింపులను చూసుకొని వాటికనుగుణంగా పద్దులు సిద్దం చేసుకొని అన్ని రాష్ట్రాలు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకుంటాయి.
కనుక ఈ నెల 24 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మొదటి రోజున ఉభయ సభల సభ్యులని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. దానిలో శాసనసభలో చర్చించాల్సిన అంశాలు (అజెండా), ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది (షెడ్యూల్) ఖరారు చేస్తారు.
Also Read – విజయసాయీ ఏమిటీ నస?
మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. ఆ తర్వాత ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో 2025-26 సంవత్సరాలకు గాను రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించాల్సి ఉన్నందున కనీసం రెండు నుంచి మూడు వారాలు సమావేశాలు నిర్వహించాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!
మంత్రులందరికీ ఇప్పటికే తమతమ శాఖలపై పట్టు వచ్చింది కనుక బడ్జెట్ సమావేశాలలో వారివారి శాఖలకు సంబందించి చర్చించేటప్పుడు సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలు ఇచ్చేవిదంగా అందరూ సిద్దమై రావాలని సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూచించారు.
ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే సమయానికి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి వెళ్ళినందున, రాష్ట్రానికి పలు పరిశ్రమలు, ప్రాజెక్టులు మంజూరు చేసినందున పూర్తి సానుకూల వాతావరణంలో సమావేశాలు జరుగబోతున్నాయి.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
ముఖ్యంగా శాసనసభ సమావేశాలకు హాజరుకాబోమని జగన్ తెగేసి చెప్పినందున ఎటువంటి అవరోధాలు లేకుండా సమావేశాలలో ప్రతీ అంశంపై లోతుగా చర్చించేందుకు కూటమి ప్రభుత్వానికి మంచి అవకాశం లభిస్తుంది.
కానీ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోయినా, సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతూనే ఉంటారు. శాసనసభకు రాకపోయినా ఆవిదంగానైనా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా చెప్పారు. కానీ రాకపోతే అనర్హత వేటు వేస్తామని డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కూడా చెప్పారు! కనుక ఏం జరుగుతుందో చూడాల్సిందే!