
ఐదేళ్ళ జగన్ విధ్వంస అరాచక పాలన చూసిన వారందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కో లుకోగలదా? అమరావతి ఎప్పటికీ శిధిలావస్థలోనే ఉండిపోతుందా?పోలవరం నిర్మాణం ఎప్పటికైనా పూర్తవుతుందా?రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు వస్తాయా?కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏమిటి?ప్రజల పరిస్థితి ఏమిటి?అనే ప్రశ్నలన్నిటికీ సిఎం చంద్రబాబు నాయుడు కేవలం 11 నెలల్లో జవాబులు ఇచ్చారు.
Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!
అమరావతి, పోలవరం పూర్తిచేయడమే కాదు.. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ఏర్పాటుకి కూడా జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క పరిశ్రమలు, దేశ విదేశాలకు చెందిన ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలను వాటితో లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువస్తున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. దానిలో రూ.33,720 కోట్లు పెట్టుబడులతో వివిద రంగాలలో 19 సంస్థలకు ఆమోదముద్ర వేశారు.
Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?
పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించడం కంటే పెట్టుబడిదారులలో ‘జగన్ ఫోబియా’ పోగొట్టి వారికి నమ్మకం కలిగించడమే చాలా గొప్ప విషయం. వారి పెట్టుబడులకు, సంస్థలకు భద్రత ఉంటుందని సిఎం చంద్రబాబు నాయుడు నమ్మకం కలిగించగలిగారు. కనుకనే రూ.33,720 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం (ఎస్ఐపీబీ) వాటి ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది కనుక త్వరలోనే పేపర్ వర్క్స్ పూర్తి చేసి నిర్మాణ పనులకు శంకు స్థాపనలు చేస్తారు.
ఏయే జిల్లాలలో ఏయే పరిశ్రమలు రాబోతున్నాయంటే…