andhra-pradesh-set-for-growth-under--chandrababu-naidu

కేవలం బటన్లు నొక్కి ప్రజలకు ఉచిత పథకాలు అందించడమే పాలన, వందల మంది సలహాదారులను పెట్టుకుని రాష్ట్రంలో మూడు ముక్కలాట ఆడడమే ప్రభుత్వం అంటూ మొండిగా, మూర్ఖంగా ముందుకెళ్లిన వైసీపీ అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది.

అయితే గత ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్రంలో విధ్వంశమే సృష్టించింది. అలాగే కేవలం ఉచిత పథకాల అమలుతో రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగతీసింది. అభివృద్ధి లేని సంక్షేమాన్ని ప్రజలు ఎన్నటికీ ఒప్పుకోరు అనేది 2024 ఎన్నికలతో అన్ని రాజకీయ పార్టీలకు తెలిసొచ్చింది.

Also Read – కవితకి కష్టం వస్తే.. బీసీ రిజర్వేషన్స్‌ లేకుంటే లేదు!

అయితే పాలన అంటే అభివృద్ధి, ప్రభుత్వం అంటే సంక్షేమం అంటూ రాష్ట్ర భవిష్యత్ కు ఇవి రెండు జోడెడ్ల బండి లాంటివని బలంగా నమ్మి, వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంలో టీడీపీ ఎప్పుడు తనదైన మార్క్ చూపిస్తుంది. ఈ రెండిటిని సమంగా బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది.

తన విజనరీ తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వెయ్యగలరు, తన అనుభవంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చెయ్యగలరు. వైసీపీ చేసిన ఆర్ధిక విధ్వంశంతో చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడానికి, వైసీపీ అవినీతి తో ఖాళీ అయిన రాష్ట్ర ఖజానాను తిరిగి పునరుద్ధరించడానికి కాస్త సమయం తీసుకున్న బాబు ఇప్పుడు తన రెండు కళ్ళ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమాన్ని ఆచరణ సాధ్యం చేస్తున్నారు.

Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?

ఇప్పటికే మే 2 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద వైసీపీ గ్రహణంతో అరణ్యంలా మారిన రాజధాని అమరావతి పనులను తిరిగి పునరుద్ధరించారు. మూడేళ్ళ లక్ష్యంతో పనుల పూర్తికి అధికారులకు, సంబంధిత మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇటు పరిశ్రమల విషయానికొస్తే TCS, LG, RENEW, భారత్ ఎలక్ట్రానిక్, వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్, రిలయన్స్, లూలూ…ఇలా పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాడానికి ముందుకొచ్చాయి.

ఇక ఏపీని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామంటూ ‘బిట్స్’ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు అమరావతిలో 70 ఎకరాల భుముని కేటాయించారు. అలాగే 2027 నాటికీ పోలవరం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం అంటూ హామీ ఇచ్చారు, అందుకు తగ్గట్టే పోలవరం పనులలో వేగం పెంచారు.

Also Read – జగన్‌ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!

ఇలా ఒకపక్క అభివృద్ధిని పట్టాలెక్కిస్తూనే మరోపక్క ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. సూపర్ సిక్స్ లో భాగమైన ‘4 వేల పెన్షన్’ పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలులోకి వచ్చింది.

ఇక ఈ ఏడాది జూన్ నుంచి ‘తల్లికి వందనం’ పేరుతో ప్రతి బిడ్డకు 15 వేలు అందించడానికి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి నిధులు మంజూరు చేసారు. ఇక మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఉచిత బస్సు’ పథకం కూడా ఈ ఆగస్టు నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఇక ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తే అటు కంటికి కనిపించే అభివృద్ధితో పాటుగా ఇటు పేద వారి బతుకులకు అవసరమైన సంక్షేమం కూడా రాష్ట్రంలో అమలులోకి వచ్చినట్టే. దీనితో పథకాల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ ఎక్కుపెట్టే విమర్శలకు చెక్ పడినట్టే అవుతుంది.