
రాష్ట్ర విభజనతో ఒకసారి, ఐదేళ్ళ జగన్ విధ్వంస పాలనతో మరోసారి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు. ఇప్పటికే రాష్ట్రంలో వివిద రంగాలలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి.
అమరావతి, పోలవరం నిర్మాణ పనులు ఇందుకు పెద్ద ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవికాక రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమత్తులు, కొత్త రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖతో సహా పలు జిల్లాలలో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేశారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం మూడు జిల్లాలకు మద్యన భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయం నుంచి పౌరవిమాన సేవలు మొదలవుతాయి.
విశాఖ, విజయవాడ మెట్రో ప్రతిపాదనకు కార్య రూపం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. విశాఖలో ఫేజ్-1 కింద 46.3 కిమీ మేర మెట్రో రైల్ నిర్మాణానికి రూ.11,498 కోట్ల అంచనాతో డీపీఆర్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడంతో ఆ రంగంలో కూడా పెట్టుబడులు వస్తున్నాయిప్పుడు.
రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ ఆదాయం, ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు కావడం చాలా అవసరం. ఈ తొమ్మిది నెలలలోనే సుమారు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇటు విశాఖ నుంచి అటు కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు వరకు అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
తాజాగా మరో పది సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో డాల్మియా సిమెంట్, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్, ఒబిరాయ్ విల్లాస్ రిసార్ట్ వంటివి ఉన్నాయి. ఈ పది సంస్థలు కలిసి మొత్తం 1,21,659 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. వీటన్నిటి ద్వారా సుమారు 80,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.