CBN

చంద్ర బాబు అనే నేను., పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ నిన్న ముఖ్యమంత్రి బాబు తో సహా 26 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం పూర్తి చేసారు. అయితే నాలుగోవసారి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న బాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకుని సెక్రటేరియట్ కు బయలు దేరారు.

అమరావతిలో ముఖ్యమంత్రిగా బాబు బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే నేను….ఎటువంటి రాగ ద్వేషాలు కాని, అసమానతలు కాని లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు స్థానం కల్పిస్తూ తానూ బలపడుతూ రాష్ట్ర భవిష్యత్తుని నిలబెడతానంటూ రాజధాని గా మరోసారి అమరావతి తన పూర్వ వైభవాణ్ని దక్కించుకోనుంది.

Also Read – ప్రజల మద్యకు రావడానికి కూడా హింస అవసరమా?

ఐదేళ్ల వైసీపీ గ్రహణానికి నేటితో తెరపడిందంటూ అమరావతి రైతులు తమ దీక్షా శిబిరాలను తొలగించి సంబరాలు చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా సెక్రటేరియట్ కు వెళ్లాలన్న, అసెంబ్లీ కి వెళ్లాలన్నా పరదాల చాటున వెళ్లే ముఖ్యమంత్రి కాన్వాయి నేడు దర్జాగా పూల బాటలో వెళ్ళింది.అమరావతి అనేది కొన్ని వందల కుటుంబాల త్యాగాలు, వారి కన్నీటితో తడిచిన నేల, ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ దశ దిశా మార్చనుంది. ఈ ఐదేళ్లలో అమరావతి అనే నేను ఏపీ రాజధాని అని దేశంతో పాటు ప్రపంచం గుర్తించేలా వెలగాలని ఆశిద్దాం.

ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానూ అంటూ నాడు బాబు చేసిన శపధం…వైసీపీ ని అధః పాతాళానికి తొక్కేస్తా అంటూ పవన్ చేసిన శపధం జూన్ 4 తో నెరవేరడంతో అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు వచ్చిన నిర్మాణాలకు కొత్తగా రెక్కలొచ్చాయి. పాడైన భవనాలకు రంగులొచ్చాయి. బాబు రాకతో అసలు అమరావతికే ఒక కళ వచ్చింది.

Also Read – ఈ అన్నాచెల్లెళ్ళకి కాస్త ఎవరైనా చెప్పండర్రా!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాబు మాట ఇచ్చినట్టే తన తొలి సంతకం 16,347 టీచర్ పోస్టుల భర్తీతో మెగా డీఎస్సి పైన, రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పైన, పెన్షన్ 4 వేలకు పెంచుతూ మూడవ సంతకం, నాల్గవ సంతకంతో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన పైళ్ల మీద ఐదవ సంతకం చేసారు బాబు.

ఈ ఎన్నికలలో తానూ గెలిస్తే తన ప్రమాణస్వీకారం మొదలుకుని రాజధాని వరకు అన్ని విశాఖ కేంద్రంగానే ఉంటాయని జగన్ ఎన్నికల ప్రచారంలో బాహాటంగా చెప్పుకున్నప్పటికీ విశాఖలో కనీసం ఒక్క సీటు కూడా సాధించుకోలేకపోయింది వైసీపీ. అమరావతిలో వైసీపీ చేసిన విధ్వంసాన్ని కళ్ళారా చుసిన విశాఖ వాసులు జగన్ గాలి కూడా విశాఖలో ఉండకూడదు అనేలా తమ ఓటుతో గట్టి బదులిచ్చారు.

Also Read – బాబాయ్‌ని లేపేసి దుష్ప్రచారం చేసినవారికి ఇదో లెక్కా?

అటు విశాఖ, ఇటు కర్నూల్ లో కూడా జగన్ కు గోర ఓటమి దక్కడంతో ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా అమరావతినే రాజధానిగా అంగీకరించారనేది స్పష్టమయ్యిపొయింది. ఇక ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తా, అధికారం దక్కినప్పుడల్లా విద్వేషాలు రెచ్చకొడతా అంటూ ఎవరైనా ముందుకొస్తే వారికి జగన్ కు పట్టిన గతే పడుతుందని ఏపీ ప్రజానీకం ఓటు అనే బటన్ నొక్కి మరి బుద్ది చెప్పారు.