Pawan Kalyan Went to Madhurai

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ నేడు ప్రత్యేక విమానంలో తమిళనాడులో మధురై చేరుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొనేందుకుపిక్ మధురై వెళ్ళారు. మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) భక్తులు నిర్వహిస్తున్న మురుగ భకతర్గల్‌ మానాడు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు, పవన్ కళ్యాణ్‌ తమిళనాడు సాంప్రదాయం ప్రకారం తెల్లటి పంచ, తెల్లటి చొక్కా ధరించి వెళ్ళారు.

Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…

ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక పవన్ కళ్యాణ్‌ దీనిలో అధికార డిఎంకే పార్టీని విమర్శిస్తూ రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు చేయరనే భావించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటారు. కనుక దానిని తీవ్రంగా వ్యతిరేకించే అధికార డిఎంకే పార్టీపై ఆ కోణంలో తప్పక ఏదో ఓ విమర్శ చేసే అవకాశం కూడా ఉంది. చేస్తే అధికార డిఎంకే పార్టీ నాయకులు కూడా ప్రతి విమర్శలు చేయక మానరు.

ఒకవేళ పవన్ కళ్యాణ్‌ రాజకీయ విమర్శలు చేసినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారవచ్చు.

Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్‌ కళ్యాణ్‌

ఒకవేళ పవన్ కళ్యాణ్‌ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగానికే పరిమితమైనా, ఏపీలో వైసీపీ నేతలు, వారి మీడియా రెడీగానే ఉంటాయి.

పవన్ కళ్యాణ్‌ ఏపీని గాలికొదిలేసి పొరుగు రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి ప్రత్యేక విమానంలో వెళ్ళారని వైసీపీ విమర్శించకుండా ఉండదు.

Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు


కనుక డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మధురైలో ఏం మాట్లాడబోతున్నారో.. ఏం జరుగుతుందో ఎదురు చూడాల్సిందే!