Vivekananda Reddy Murder Case

సినీ దర్శకులు సైతం తమ సినిమాలలో వివేకానంద రెడ్డి హత్య వంటి సన్నివేశాలను గుండెపోటుగా చిత్రీకరించలేరేమో? తమపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారిపైనే ఎదురుకేసు వేసి బెంబేలెత్తించడం, ఈ కేసు విచారణ ముగింపు కి డెడ్ లైన్ పెట్టిన సుప్రీంకోర్టు చేతే వాయిదాలు వేయించగల గొప్ప తెలివితేటలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకే ఉన్నాయి.

ఈ హత్యారోపణలతో సీబీఐ కేసులని ఎదుర్కొంటూ, సుప్రీంకోర్టుని ఆశ్రయించి బెయిల్‌ సంపాదించుకున్నవారే, వివేకా కుమార్తె, అల్లుడు, చంద్రబాబు నాయుడు ఈ హత్యకు కుట్ర చేశారంటూ ఏమాత్రం తడబడకుండా నిర్భయంగా వాదిస్తుండటం ఇంకా గొప్ప విషయం.

Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!

మనం దొంగతనం, హత్య, అత్యాచారం చేయలేదని నిందితులు తమని తాము నమ్మించుకోగలిగితేనే ఇంత ధైర్యంగా మాట్లాడగలరని మానసిక నిపుణులు చెపుతుంటారు. ఈ కేసులో నిందితుల ధోరణి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, వివేకా హత్య కేసులో అప్రూవరుగా మారిన దస్తగిరి, నిందితులలో ఒకరైన శివశంకర్ రెడ్డి తాను కడప జైల్లో ఉన్నప్పుడు తన కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ద్వారా బెదిరించారని పోలీసులకు పిర్యాదు చేశాడు.

Also Read – యాదగిరిగుట్టకు ఓ బోర్డు… అవసరమా?

ఈ కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెపితే రూ.20 కోట్లు ఇస్తామని, లేకుంటే జైలు నుంచి బయటకు రాగానే లేపేస్తామని బెదిరించాడని పిర్యాదులో పేర్కొన్నాడు.

అతని పిర్యాదు మేరకు ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరిండెంట్‌ రాహుల్ శ్రీరామ విచారణాధికారిగా నియమించింది. ఆయన దస్తగిరిని ప్రశ్నించి, సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. తర్వాత డాక్టర్ చైతన్య రెడ్డిని విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?

వివేకా హత్య కేసు 5 ఏళ్ళు అయినా ముందుకు సాగకుండా విజయవంతంగా బ్రేకులు వేస్తున్న నిందితులు, ఈ ఊహించని ఈ తాజా పరిణామాలపై ప్రమాదం శంకించిన నిందితుల సొంత మీడియా, సోషల్ మీడియాలో యధాప్రకారం పుంఖాను పుంఖాలుగా కధనాలు వండి వార్చేస్తోంది.

ఒకవేళ ఈ దస్తగిరి పిర్యాదు ఆధారంగా కూటమి ప్రభుత్వం ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళి దస్తగిరిని బెదిరించిన్నట్లు నిరూపించగలిగితే, అది బెయిల్‌ షరతులు ఉల్లంఘించిన్నట్లే అవుతుంది. కనుక ఈ కేసులో బెయిల్‌ పొందిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో సహా మొత్తం అందరూ లోపలకు వెళ్ళిపోవలసివస్తుంది.

ఒకవేళ అవినాష్ రెడ్డి లోపలకు వెళితే ఒంటరిగా వెళ్ళరు. ఆయన నోరు విప్పితే ఏమవుతుందో అందరికీ తెలుసు. సామాన్య ప్రజలు ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని దస్తగిరి తాజా ఎపిసోడ్‌పై వైసీపీ సొంత మీడియా తీవ్రంగా స్పందించడం చూస్తుంటే పెద్ద ప్రమాదం శంకిస్తున్నట్లే ఉంది.

అయినా వివేకా హత్యతో వైసీపీ నేతలు ఎవరికీ సంబంధం లేకపోతే ఇంత ఆందోళన, భయం దేనికి?