AP Police

వ్యవస్థలు దారి తప్పి వ్యక్తులకు తొత్తులుగా మారితే పరిస్థితులు ఏ స్థాయికి చేరుకుంటాయి అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ నిదర్శనముగా మారింది. గత ఐదేళ్లు వ్యక్తి పూజకు అలవాటు పడి, చట్టాలను కొందరికి చుట్టాలుగా మార్చి, న్యాయానికి అన్యాయం చేస్తూ సాగించిన ‘లా అండ్ ఆర్డర్’ విధానం నేటి ఏపీ భవిష్యత్ కు ప్రశ్నార్థకంగా మారింది.

దీని ఫలితాలు సామాన్యుడి నుండి సెలబ్రేటిస్ వరకు మోయాల్సిన పరిస్థితులు దాపరించాయి. సాక్ష్యాత్తు ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రులకు, వారి కుటుంబాలకే వైసీపీ సోషల్ మీడియా బెడద తప్పడం లేదు అంటే ఇక సామాన్య మహిళా భద్రత పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాం, సానుభూతి చూపిస్తూనే ఉంటున్నాం.

Also Read – ప్రభుత్వాలు చేతులు కట్టేసుకునే పరిస్థితి దాపురించిందా?

ఇలాంటి పరిస్థితులకు ఆజ్యం పోసిన నేత ముఖ్యమంత్రి స్థాయి నుండి సాధారణ ఎమ్మెల్యే స్థాయికి దిగజారిన ఇంకా అదే పంధాలో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ప్రదేశ్ గా మారుస్తున్నారు. వైసీపీ కండువాలు కప్పుకుని, జగన్ ఫోటోలు పెట్టుకుని సోషల్ మీడియాలో వైసీపీ కాలకేయ సైన్యం చేస్తున్న అరాచకాలు అత్యాచారాలకు తక్కువేమి కాదు.

అటువంటి పోస్టులు పెడుతూ సభ్యసమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న నేతలను కట్టడి చేయాల్సిన పార్టీ అధినేత తన ప్రభుత్వ హయాంలో ఇటువంటి వారిని ప్రోత్సహించి పోలీసులతో లాలూచీలు కుదుర్చుకున్నారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడానికి వెనుకాడని ఈ పోలీస్ వ్యవస్థ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ, మహిళల మీద నీచమైన విమర్శలు చేసిన వాడిని కట్టడి చేయలేకపోతున్నారు.

Also Read – కూటమి ప్రభుత్వం: పాత సినిమా రీ-రిలీజ్?

అలాగే ఒక సినీ హీరోగా, పొలిటికల్ లీడర్ గా అత్యంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ ను సైతం ఒక హోటల్ గదిలో నిర్బంధించగల స్తైర్యం ఉన్న ఈ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ పెద్దలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అస్లీల పోస్టులు పెట్టే ఒక అరాచక శక్తిని నిలువరించలేకపోతుంది.

ఇలా గత ఐదేళ్ల అలసత్వం ఒక తరం భవిష్యత్ కు శాపంగా మారి రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యలకు ఊతమిచ్చింది. దీనితో ఇటు ప్రభుత్వ పెద్దలు సైతం పోలీస్ వ్యవస్థ పని తీరు పై బహిరంగ విమర్శలు గుప్పిస్తూ వారి అలసత్వాన్ని తప్పుబట్టారు.

Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?

అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన వ్యవస్థలే న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి అనేది హోమ్ మంత్రి అనిత విషయంలో స్పష్టమయింది. తానూ కూడా వైసీపీ సోషల్ మీడియా బాధితురాలినే అంటూ అనిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సమాజ తీరుకి అద్దం పడుతున్నాయి.

పోలీస్ వ్యవస్థ పని తీరు మీద ప్రభుత్వ మంత్రులే వేలెత్తి చూపే స్థితికి పోలీస్ వ్యవస్థ చేరుకుంది అంటే అది ఆ వ్యవస్థకే కాదు రాష్ట్రానికే అవమానం. ఈ అవమాన బార్ని మోయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ ప్రభుత్వం తెగేసి చెప్పడంతో పోలీస్ వ్యవస్థలో కాస్త చలనం వచ్చింది.

ఇక ఈ విధ్వంసానికి నారు పోసి, నీరు పెట్టి పెంచి పోషించిన జగన్ సైతం పోలీస్ వ్యవస్థ పని తీరును తప్పుబడుతున్నారు. పోలీసులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి వైసీపీ సోషల్ మీడియా సైన్యం మీద అక్రమ కేసులు మోపుతున్నారని, అధికారం ఇప్పుడు కూటమి ప్రభుత్వానిది కావచ్చు ఈసారి అధికారం మారితే పోలీసులు ఆలోచించుకోవాలంటూ అటు వైసీపీ అధినేత జగన్ కూడా పోలీస్ వ్యవస్థను దుయ్యబట్టారు.

భావ ప్రకటన స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వ సంకెళ్లు వేస్తుందని, దానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని పోలీసులను నిందిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇలా పోలీస్ వ్యవస్థ అటు ప్రభుత్వ పెద్దల దగ్గర విమర్శలు ఎదుర్కొంటు, ఇటు విపక్షం నుండి చివాట్లు తింటున్నారు. దీనితో రెంటికి చెడ్డ రేవడి మాదిరి “మద్దెల మోతకు” సిద్దమయ్యింది పోలీస్ వ్యవస్థ.