
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున పరిశ్రమలు అవసరం ఉందని సిఎం చంద్రబాబు నాయుడు భావించగా, ఆయన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ సంక్షేమ పధకాలు సరిపోతాయని గట్టిగా నమ్మారు.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
కనుక చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చిన ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్‌కి జగన్ బ్రేకులు వేసి కదలకుండా నిలిపేశారు.
దానికి బ్రేకులు వేసి నిలిపేస్తే చంద్రబాబు నాయుడుపై కక్ష తీర్చుకున్నట్లు అవుతుందనుకున్నారు తప్ప రాష్ట్రానికి నష్టం కలుగుతుందనుకోలేదు. అది ఉత్పత్తి ప్రారంభిస్తే ఆ క్రెడిట్ తనకి, తన ప్రభుత్వానికే దక్కుతుందని జగన్ గ్రహించలేకపోయారు. ఆయన చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవడమే గాక ఈ గొప్ప అవకాశం తాను ఎంతగానో ద్వేషించే మంత్రి నారా లోకేష్‌కి దక్కేలా చేశారు కూడా.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో మల్లవల్లి పారిశ్రామికవాడలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ కంపెనీని మంత్రి నారా లోకేష్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ ప్లాంట్‌లో ఏడాదికి 4,800 బస్సులు తయారు చేస్తామని తొలిదశలో 600 మందికి, రెండో దశలో మరో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అశోక్ లే ల్యాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందుజా చెప్పారు. నేటి నుంచే తమ ప్లాంట్‌లో ఉత్పత్తి (బస్సుల తయారీ) ప్రారంభిస్తామని ఆ సంస్థ ఎండీ, సీఈవో షేను అగర్వాల్ చెప్పారు.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పరిశ్రమలు, పెట్టుబడుల గురించి మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుంటే, సిఎంగా చేసిన జగన్, పరిశ్రమల శాఖా మంత్రిగా ఏ గుడ్డూ చేయని గుడివాడ అమర్నాథ్ తదితర వైసీపీ నేతలు వైఎస్సార్ పేరు తొలగింపు గురించి మాట్లాడుతున్నారు! వైజాగ్ క్రికెట్ స్టేడియం పేరులో ‘వైఎస్సార్’ తొలగించినందుకు నిరసనగా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
రెండు పార్టీలు, వాటి అధినేతలు, మంత్రులు, వారి ప్రభుత్వాల మద్య ఎంత తేడా ఉందో అర్దం చేసుకునేందుకు ఈ ఉదాహరణ చాలదా?