
శాసనసభ్యులు స్పీకర్ అనుమతి తీసుకోకుండా 60 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోతే వారి సీట్లు ఖాళీ అయిన్నట్లు ప్రకటించాల్సి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముందే హెచ్చరించడంతో జగన్‌తో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు.
శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు జగన్ కొందరు ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు చేసి సభలో నుంచి పారిపోయారు. మిగిలినవారు కూడా ఆ తర్వాత వచ్చి శాసనసభ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్ళిపోయారు.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇదే విషయం ప్రస్తావిస్తూ “వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్ళిపోయారు. మీరందరూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే తప్ప దొంగలు కారు కదా? అటువంటప్పుడు అలా దొంగచాటుగా సంతకాలు చేసి పారిపోవాల్సిన ఖర్మ ఏమిటి మీకు? దర్జాగా సంతకం చేసి వచ్చి శాసనసభ సమావేశాలలో పాల్గొంటే ఎవరైనా వద్దంటారా? శాసనసభ సమావేశానికి వస్తే మీకు గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదు కదా?” అని అన్నారు.
దొంగచాటుగా వచ్చి శాసనసభ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళేనంటూ స్పీకర్ వారి పేర్లను సభలో చదివి వినిపించారు. ఆ ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళే.. వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధరెడ్డి, విశ్వేశ్వరరాజులు.
Also Read – కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?
వైసీపీ ఎమ్మెల్సీలు టంచనుగా మండలి సమావేశాలకు హాజరవుతూ ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు, వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం శాసనసభకు రావడానికి నామోషీ దేనికి?ఒకవేళ ఎమ్మెల్యేలు హాజరుకాకూడదని జగన్ నిర్ణయిస్తే ఎమ్మెల్సీలను కూడా వెళ్ళనీయకూడదు కదా?ఎందుకు పంపిస్తున్నారు?
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!