ప్రస్తుతం టిడిపి, వైసీపిల మద్య సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. వైసీపి అధికారంలో ఉన్నప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితా వంగలపూడిల పట్ల చాలా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చాలా రెచ్చిపోయారు.
Also Read – అమరావతి రాజధాని… మద్యలో మన చంద్రుడు
ఇటీవల పవన్ కళ్యాణ్ అలారం బెల్ కొట్టిన తర్వాత ఏపీ ప్రభుత్వం అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం ప్రారంభించింది. వారిలో వర్రా కూడా ఒకరు.
కానీ ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే నేడు వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని ప్రశ్నించేందుకు పులివెందులలో ఆయన ఇంటికి వెళ్ళారు. కానీ ఆయన కూడా ఇంట్లో లేరు.
Also Read – స్థలాలు, పొలాల కబ్జాలు కాదు… పోర్టునే కబ్జా చేస్తే?
ఈ వ్యవహారంపై పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్ రాష్ట్రవ్యాప్తంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “గత రెండు మూడు రోజులుగా వైసీపి నేతలు, వారి సోషల్ మీడియాలోనే వర్రా అజ్ఞాతంలో ఉన్నారని ఒకసారి, ఆయనని పోలీసుల అదుపులో ఉన్నారంటూ రకరకాలుగా ప్రచారం చేస్తుండటం చూస్తుంటే, వర్రాని లేపేసేందుకు వైసీపి కుట్ర పన్నుతోందేమో? అనే అనుమానం కలుగుతోంది.
వర్రా విషయంలో వైసీపి చేస్తున్న అతి చూస్తుంటే వారే అతనిని ఏదో చేయబోతున్నారనే అనుమానం నాకు కలుగుతోంది. తద్వారా వర్రాని పోలీసులే చంపేశారని ఆరోపిస్తూ, దానికి సిఎం చంద్రబాబు నాయుడుని, ఏపీ ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని కుట్ర చేస్తున్నట్లు నాకు అనుమానం కలుగుతోంది.
Also Read – కేసీఆర్, కేటీఆర్ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?
కనుక పోలీసులు వీలైనంత త్వరగా వర్రాని అరెస్ట్ చేసి వైసీపి నుంచి ఆయన ప్రాణాలకు భద్రత కల్పించాలి,” అని బీటెక్ రవి విజ్ఞప్తి చేశారు.
సొంత బాబాయ్‌ని లేపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారికి, సొంత తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చి వారిని సొంత పార్టీ నేతల చేతనే తిట్టిస్తూ, సొంత మీడియాలోనే వారిపై బురద జల్లుతున్నవారికి వర్రా ఓ లెక్కా? అనుకుంటే బీటెక్ రవి చెప్పింది నిజమే అనిపించకమానదు.