
వైస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి ఆరోపణలతో, తన అక్రమాస్తుల కేసులతో వెలుగుకి వచ్చారు. అయితే అప్పుడు వైస్ జగన్ తో పాటుగా తెలుగు ప్రజలందరికీ మరో వ్యక్తి సుపరిచులయ్యారు.
ఆయనే విజయసాయి రెడ్డి. జగన్ అక్రమాస్తుల కేసులు A1 గా జగన్ స్థానం దక్కించుకుంటే ఆ తరువాత స్థానమైన A2 ని విజయసాయి రెడ్డి కైవసం చేసుకున్నారు. అయితే నాటి నుంచి కూడా అటు వైసీపీ కి పార్టీ పరంగా, ఇటు జగన్ కు రాజకీయ పరంగా విజయసాయి రెడ్డి జగన్ షాడో లా వ్యవహరించారు.
Also Read – ఇదిగో మీకు 15 వేలు.. ఇదిగో మీకు 15 వేలు..
చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నత చదువులు చదివిన సాయి తన శక్తిని ఒక అవినీతి కి కంచెలా వాడారు, తన సామర్ధ్యాన్ని అక్రమాలకు ఆయుధంతో వినియోగించారు. దీనితో జగన్ పైన నమోదైన కేసులన్నిటిలోను జగన్ తో పాటుగా విజయ సాయి పేరు కూడా తప్పనిసరైయింది. జగన్ చేసిన అన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో సాయి పాత్ర కీలకం అనేది జగమెరిగిన సత్యమే.
అయితే జగన్ అక్రమాలను, అవినీతిని కాపాడుకుంటూ వచ్చిన విజయసాయి చివరికి వైసీపీ రాజకీయాలతో సమిధి గా మారక తప్పలేదు. తాజాగా విజయసాయి వైసీపీ కి రాజీనామా చేయడంతో పాటుగా రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం తో ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారా అనుకున్న తరుణంలో వినూత్నంగా భారతి సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పేరు తెరమీదకొచ్చింది.
Also Read – చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం తీగ లాగితే డొంక వైస్ జగన్, భారతి సిమెంట్ లో తేలింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ శ్రేయోభిలాషులుగా చెప్పుకునే విజయసాయి సిఐడి విచారణ ఎదుర్కొన్నారు.అలాగే ఈ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణిక్య , దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టయ్యి జగన్ బాధితులుగా మిగిలారు.
ఇక ఇప్పుడు ఏ – 33 గా బాలాజీ గోవిందప్పను నిన్న మైసూర్ లో అరెస్టు చేసారు సిట్ అధికారులు. దీనితో ఈ కేసులో ఇప్పటికి 5 గురు వైసీపీ బినామీలు అరెస్టయ్యారు. తవ్వేకొద్దీ కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టు విచారణ జరిపే కొద్దీ ఈ కేసులో రోజుకో కొత్త పేరు బయటకొస్తూనే ఉంది.
Also Read – చంద్రబాబు ఏడాది పాలన: ఓ రివ్యూ
అయితే వీరంతా కూడా కేవలం పాత్రధారులే కానీ సూత్రదాలు కారని, ఈ స్కాం తాలూకా అసలు పెద్ద తలకాయలు అతి త్వరలో బయటకు రాబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి నాడు జగన్ ఆర్థిక నేరాలను కొమ్ముకాసిన విజయసాయి మాదిరి నేడు భారతి సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కూడా వైసీపీ లిక్కర్ స్కాం లావాదేవీలను కాపుకాస్తారా.?