వైసీపి సీనియర్ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆ పార్టీలో జరిగిన అవమానాలు, ఆ కారణంగా ఆయన అలక పాన్పు కధలు చాలాసార్లే విన్నాము.
Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?
నిజానికి జగన్ ఆయనకు సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇచ్చి ఉండి ఉంటే ఈ కధలన్నీ ఉండేవే కావు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అవ్యాజమైన ప్రేమ వల్లనో, ఆయన చెప్పుడు మాటలు వినడం వలననో పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైజ్ తగ్గించే ప్రయత్నాలు చేశారు.
ఆయన స్థానంలో చెవిరెడ్డిని తెచ్చిపెట్టుకొని ఒంగోలులో వైసీపిని నిలువునా ముంచుకున్నారు. చేతులు కాలిన తర్వాత కూడా ఆకులు పట్టుకోవడానికి జగన్ ఇష్టపడకుండా చెవిరెడ్డిని ఒంగోలుకి తగిలించడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ అలకపాన్పు ఎక్కేశారు. గత మూడు నెలలుగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read – ఒక్క ‘దేవర’ కే పట్టిన చిక్కా..?
జిల్లా వైసీపి నేతలు కూడా చెవిరెడ్డి మాకొద్దని పోరుతున్నారు. కానీ అంత మాత్రన్న వారు బాలినేనికి మద్దతుగా పోరాడం లేదు. బాలినేని ఎలాగూ జనసేనలోకి వెళ్ళిపోయేందుకు బ్యాగులు సర్దేసుకున్నారని గ్రహించడంతో జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకోవాలని పోరుతున్నారు.
వారు ఊహించిన్నట్లే గురువారం రాత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తాడేపల్లి ప్యాలస్‌కు పిలిపించుకుని, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఆఫర్ చేశారు. వారు ఊహించిన్నట్లే ఆయన తిరస్కరించారు!తాను పార్టీని వీడుతున్నట్లు జగన్‌కి చెప్పేసిన్నట్లు సమాచారం.
Also Read – విశాఖ అభివృద్ధిలో మరో అడుగు టీసీఎస్!
కనుక జగన్ ఇవాళ్ళ ఒంగోలు వైసీపి నేతలను తాడేపల్లి ప్యాలస్‌లో అత్యవసర సమావేశానికి పిలిచారు. దర్శి, యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, తాడిపర్తి చంద్రశేఖర్ ఒంగోలు వైసీపి అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్దంగా ఉన్నారు. నేడు వారిలో ఎవరో ఒకరి పేరు ప్రకటించే అవకాశం ఉంది.
కనుక వైసీపిలో బాలినేని చివరి అధ్యాయంలో చివరి పేజీ చదువుతున్నామని అనుకోవచ్చు. అయితే బాహుబలి క్లైమాక్స్‌లో కట్టప్ప ఊహించని ట్విస్ట్ ఇచ్చిన్నట్లు, వైసీపిలో కట్టప్ప(?) కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కనుక బాలినేని క్లైమాక్స్ ఏవిదంగా ఉంటుందో మరికొన్ని గంటలలో తెలియవచ్చు.