
భారత్ – పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో పాక్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రాణ భయంతో అల్లాడుతున్నారు. ఏ నిముషం ఎం జరుగుతుంది, ఎప్పుడు ఎటువైపు నుంచి కాల్పుల మోతలు వినాల్సి వస్తుందో అన్న ఆందోళన సరిహద్దు ప్రాంతాల ప్రజలలో వ్యక్తమవుతోంది.
అయితే వారి భయానికి, ఆందోళనకు ఒక స్పష్టమైన అర్ధం ఉన్నప్పటికీ, అక్కడి నుంచి ప్రలందరిని తరలించడం అసాధ్యంతో కూడుకున్న పనే. అయితే పాక్ సరిహద్దు ప్రాంతమైన కశ్మిర్ లోని కశ్మిరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో విధ్యాబ్యాసానికి వెళ్లిన తెలుగు యువత ఈ బాంబుల మోతతో భయాందోళనకు చెంది తమను ఎలా అయినా ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసారు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఈ యుద్ధ వాతావరణంతో భయపడిపోతున్నామని, ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కాక అల్లాడిపోతున్నాం, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకైనా తరలించండి, లేదంటే మా స్వస్థలాలకైనా పంపించండి అంటూ అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులు బండి సంజయ్ ని ఆశ్రయించారు.
అయితే దీని మీద తక్షణమే స్పందించిన బండి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులకు బస్సులో శ్రీనగర్ నుంచి వారి వారి స్వస్థలాలకు పంపించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బండి సంజయ్ చూపిన చొరవకు విద్యార్థి తల్లితండ్రులు సంజయ్ కు కృతజ్ఞతలు తెలియచేసారు.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
ఆపదలో ఉన్నవారికి బండి సంజయ్ తన చర్యలతో ఆపన్న హస్తం అందించారంటూ కేంద్ర మంత్రి నిర్ణయం మీద సర్వత్రా హర్షం వ్యక్తం వ్యక్తమవుతోంది. అలాగే పాక్ దుందుడుకు చర్యలకు, భారత్ చేసే ప్రతిచర్యలు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సరిహద్దు ప్రాంతంలో విద్య కోసమో, ఉపాధి కోసమో వెళ్లిన వారంతా కూడా తిరిగి తమ స్వస్థలాలకు వచ్చే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు.