
భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా చేసినప్పుడు తిరుమలలో అనేక అపచారాలు, అవినీతి జరిగింది. వాటికి ఆయన ఏదోనాడు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. అది అప్రస్తుతం.
ఆయన వైసీపీలో సీనియర్ నాయకుడు కనుక కూటమి ప్రభుత్వ తప్పొప్పులను ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉంటుంది.
Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!
ఈరోజు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోతే సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ పవన్ కళ్యాణ్ చాలా హడావుడి చేశారు. ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. టీటీడీ ఛైర్మన్‌తో సహా అందరూ కూడా సారీలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
అప్పుడు అంత హడావుడి చేసి, క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్, కడప జిల్లాలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఆన్నదాన సత్రాన్ని తన అటవీశాఖ అధికారులు కూల్చివేస్తే ఇంతవరకు కనీసం ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదు?
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
తిరుపతి ఘటనలో క్షమాపణ చెప్పని నారా లోకేష్ కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఆన్నదాన సత్రాన్ని కూల్చివేస్తే ప్రభుత్వం తరపున క్షమాపణ ఎందుకు చెప్పారు?
అసలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మద్య ఏం జరుగుతోంది? వారిద్దరి మద్య ఆధిపత్యపోరులో మద్యలో ఆలయాలు, మఠాలు కూలిపోతున్నాయి,” అంటూ విమర్శలు గుప్పించారు.
Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
తిరుపతి ఘటనకు క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్, కాశీనాయన క్షేత్రంలో ఆన్నదాన సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేస్తే ఎందుకు స్పందించలేదు?ఎందుకు క్షమాపణలు చెప్పలేదు? అనే భూమన ప్రశ్న చాలా సహేతుకమే అని అర్దమవుతోంది. అంతవరకు మాట్లాడి ఆపితే ఆయన ప్రశ్నలు ఆలోచింపజేసేవి.
కానీ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మద్య ఆధిపత్యపోరు జరుగుతోందంటూ మాట్లాడటం, వారి మద్య చిచ్చు రగిలించేందుకు ప్రయత్నించడం ఆవు కధ చెప్పిన్నట్లే ఉంది. కూటమిలో టీడీపీ, జనసేనల మద్య ఏదో విధంగా చిచ్చు పెట్టి విడగొట్టగలిగితే ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు తాము చక్రం తిపొచ్చని జగన్ మనసులో ఆశ, ఆలోచనే భూమాన మాటలలో ప్రతి ధ్వనించింది.