bhumireddy-ramagopal-reddy

రాజకీయాలలో నిత్యం చాలా పరిణామాలు జరుగుతుంటాయి. కానీ రాజకీయ నాయకులు వాటిని మరిచిపోయిన్నట్లు మాట్లాడుతుంటారు.

Also Read – రెండూ సంక్రాంతి రిలీజ్ బొమ్మలే!

తాను మరో 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని గొప్పలు చెప్పుకున్న జగన్‌, ఆ విషయం మరిచిపోయిన్నట్లు అధికారం శాశ్వితం కాదని చంద్రబాబు నాయుడుని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తుండటం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.

టిడిపి నేతలు కూడా కొన్ని విషయాలు మరిచిపోయిన్నట్లు మాట్లాడుతూ, వైసీపికి తమని విమర్శించేందుకు అవకాశం కల్పిస్తుంటారు.

Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!

టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలను బ్యాలెట్లతో నిర్వహించి ఉంటే వైసీపి తప్పకుండా గెలిచి ఉండేదని జగన్‌ చెప్పుకున్నారు. కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్లతోనే జరుగబోతున్నాయి. గౌతమ్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిన జగన్‌ హటాత్తుగా ఈ ఎన్నికలలో వైసీపి పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఎందుకు?ఆయన కోరుకున్నట్లే బ్యాలెట్లతోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కదా? అయినా భయం దేనికి?” అని నిలదీశారు.

ఇంత వరకు సహేతుకంగానే ఉంది. కానీ శాసనసభ సమావేశాలకు రాని జగన్‌కు రాజకీయ పార్టీ దేనికి?శాసనసభ సభ్యత్వం దేనికి?జీతభత్యాలు దేనికి?ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తే పులివెందుల నియోజకవర్గానికి, అక్కడి ప్రజలకు ఉపయోగపడే మరో ఎమ్మెల్యేని ఎన్నిక చేసుకోగలుతాము కదా?” అని అన్నారు.

Also Read – టీడీపీకి ఇలాంటి రాజకీయాలు అవసరమా?

ఇదివరకు చంద్రబాబు నాయుడుని శాసనసభలో జగన్‌, వైసీపి ఎమ్మెల్యేలు చాలా దారుణంగా అవమానించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపధం చేసి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన కూడా శాసనసభ సమావేశాలకు వెళ్ళలేదు.

అప్పుడు వైసీపి నేతలు కూడా ఇదేవిదంగా ఆయనని ప్రశ్నించేవారనే విషయం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరిచిపోకూడదు. పదేపదే ప్రశ్నిస్తే వైసీపి నేతలు కూడా చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపుతూ టిడిపిని విమర్శిస్తారు కదా?

అయినా శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇంకా మొదలవలేదు. ఈ నెల 11 నుంచి మొదలవుతాయి. అప్పుడు జగన్‌ రాకపోతే అడిగినా అర్దం ఉంటుంది. సమావేశాలు ప్రారంభం కాక ముందే జగన్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించడం తొందరపాటే అవుతుంది కదా?