
మే 2 దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇక అక్కడ నుంచి అమరావతి పనులు శరవేగంతో ముందుకెళ్తున్నాయి.
Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్ పట్టించుకోవట్లేదే!
రానున్న మూడేళ్ళలో ఎట్టి పరిస్థితులలోను అమరావతికి ఒక రాజధాని శోభను తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలే రూపొందించింది. ఇటు పారిశ్రామిక ప్రగతికి అవసరమైన రోడ్డు, రవాణా సదుపాయాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అమరావతి కి సంబంధించిన అన్ని కనెక్టివిటీ రోడ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టింది.
అలాగే ఇటు ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా నిలబెట్టడానికి దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థలను అమరావతికి ఆహ్వానిస్తుంది. గత టీడీపీ హయాంలో VIT, SRM, అమృత వంటి ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు నాటి ముఖ్యమంత్రి బాబు భూకేటాయింపుల జరపడం ద్వారా నేటి తరం విద్యార్థులకు అవి అందుబాటులోకొచ్చాయి.
Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?
అలాగే ఇప్పుడు మరొక ప్రఖ్యాత విద్యాసంస్థ ‘బిట్స్’ అమరావతిలో ప్రారంభం కానుంది. ఇందుకు గాను కూటమి ప్రభుత్వం బిట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి 70 ఎకరాల భూ కేటాయింపులు జరిపింది. ఎకరానికి 50 లక్షల చొప్పున ఈ భూకేటాయింపు జరిపినట్టు ప్రభుత్వం ఆదివారం జీవో విడుదల చేసింది.
దీనితో AP యువత కు, విద్యార్థులకు మరో అరుదైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది. తుళ్లూరు, మందడం, వెంకటాయపాలెం గ్రామాల పరిధిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ క్యాంపస్ ఏర్పాటుకానుంది.
Also Read – కవితకి కష్టం వస్తే.. బీసీ రిజర్వేషన్స్ లేకుంటే లేదు!
అలాగే దీనికి తోడు నెక్కల్లులో ఈఎస్ఐ కార్పొరేషన్ కి 25 ఎకరాలు, హడ్కో ప్రాంతీయ కార్యాలయానికి 8 ఎకరాలు, నేలపాడులో ఆర్బీఐ కి కేటాయించిన 2 ఎకరాల భూమిని 3 ఎకరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్మాణాలన్నీ సకాలంలో పూర్తి అయితే అమరావతి ప్రగతికి తొలి అడుగు పడినట్టే అవుతుంది.
ఇన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కోసం, ఉన్నత విద్యా కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నాడు బాబు చొరవతో VIT, SRM, అమృత సంస్థల రాక ఇక్కడి విద్యార్థులకు ఇక్కడే విద్యనభ్యసించే అవకాశం దక్కినట్టయ్యింది. ఇప్పుడు వీటికి తోడు బిట్స్ కూడా రానుండడంతో ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగావకాశాలు దక్కాలి అనుకున్నవారి ఆశలు నెరవేరనున్నాయి.