
దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడినప్పటికీ నేటికీ దేశవ్యాప్తంగా దానికి బలమైన క్యాడర్, ఓటు బ్యాంక్ ఉన్నాయి. అందుకే లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా 99 సీట్లు సొంతంగా గెలుచుకోగా, ఇండియా కూటమి 238 సీట్లు గెలుచుకుంది.
కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య, మూస రాజకీయ విధానాలు, మూస ఆలోచనావిధానాల కారణంగా ప్రతీ ఎన్నికలలో ఓడిపోతూనే ఉంది. ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే ఇందుకు తాజా ఉదాహరణ. దేశంలో అన్నిటి కంటే ఘనమైన చరిత్ర కలిగిన జాతీయపార్టీ ఇప్పుడు ఏ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయలేని దుస్థితికి దిగజారింది.
Also Read – సనాతన మార్గంలో పవన్ ప్రయాణం తమిళనాడుకే
కాంగ్రెస్ బలహీనతలే బీజేపికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే దేశంలో రాజకీయాలు మారాయి. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. బీజేపి వంటి శక్తివంతమైన పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలని కలుపుకొని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమితో ముందుకు సాగడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు.
కానీ కూటమికి కాంగ్రెస్ బలమైన నాయకత్వం ఇవ్వలేకపోగా భాగస్వామ్య పార్టీలపై కర్ర పెత్తనం చేయాలనుకోవడం, అన్నిటినీ కలుపుకుపోలేకపోవడం వలన ఇండియా కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ఎన్డీఏ ధాటిని తట్టుకొని ఎదురునిలువలేకపోతోంది.
Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వైఫల్యం మాత్రమే కాదు ఇండియా కూటమి వైఫల్యంగా భావించవచ్చు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఫలితాలపై స్పందిస్తూ “మీరు ఇలాగే కీచులాడుకుంటూ కాలక్షేపం చేయండి.. బీజేపిని గెలిపిస్తూ ఉండండి,” అని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొని పనిచేయాలని ఒమర్ అబ్దుల్లాతో సహా పలువురు చెప్పినా పట్టించుకోలేదు. కనుక రెండు పార్టీలు ఓడిపోయి బీజేపికి ఢిల్లీ పీఠం అప్పగించేశాయని అర్దమవుతోంది.
Also Read – ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!
ఎన్డీఏ, ఇండియా కూటములకు ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్, ఆమాద్మీ, వైసీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కేసీఆర్ అనుకున్నారు. కనుకనే ఆమాద్మీ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నారు. కానీ ఆమాద్మీ ఓటమితో కేసీఆర్ ఆశలు కూడా ఆవిరైపోయాయి.
కనుక దేశంలో బీజేపిని ఢీకొని నిలువరించగల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేన్నట్లే. కనుక బీజేపి కాషాయ సామ్రాజ్య విస్తరణకి సహకరించేవారు మాత్రమే మిగులుతారు.. మిగిలినవారు దాని ధాటికి కొట్టుకుపోక తప్పదేమో?