
కూటమిలో వివాదం వైసీపీ కి వరం అనే అంశాన్ని చాల త్వరగా గ్రహించిన కూటమి పార్టీల పెద్దలు ఏపీ ‘డిప్యూటీ సీఎం’ లోకేష్ అనే చర్చకు, అయితే పవన్ ‘సీఎం’ అనే రచ్చకు తమ ఆదేశాలతో ఒక ముగింపు పలికారు.
లోకేష్ డిప్యూటీ సీఎం పదవి పై కానీ, కూటమి పార్టీల మధ్య పొత్తులపై కానీ ఎవరు ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని, ఆ వ్యాఖ్యలతో కూటమి పొత్తుకు విఘాతం కలిగించవద్దని సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ నాయకులకు, క్యాడర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
అయితే ఈ వివాదానికి ఇటు టీడీపీ శ్రేణుల అత్యుత్సహంతో పాటుగా ఇటు జనసైనికుల అర్ధం లేని ఆవేశం కూడా తోడవడంతో జనసేన పార్టీ కూడా తన వంతు బాధ్యతగా తమ పార్టీ క్యాడర్ కు కూడా ఈ వివాదం పై ఇక రచ్చ చేయకండి అంటూ బలమైన సంకేతాలు జారీ చేసింది.
అయితే అసలు ఈ వివాదాన్ని తెర మీదకు తెచ్చిన వారు, దాన్ని ప్రచారం చేసిన వారు బాబు, పవన్, లోకేష్ ల మధ్య ఏర్పడిన బలమైన బంధం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తనతో సమానమైన గౌరవం పవన్ కు ఇవ్వాలనే బాబు ఆప్యాత, అనుభవానికి పెద్ద పీట వెయ్యాల్సిందే అంటూ బాబు పై పవన్ చూపించే గౌరవం, నాకు పవన్, అన్న సమానుడు అంటూ లోకేష్ పవన్ మీద చూపించే ప్రేమ బహిర్గతమైనదే.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
ఇలా ఈ ముగ్గురు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, రెండు పార్టీల శ్రేణులను అన్నదమ్ముల మాదిరి కలిసి ఉండాలని సూచిస్తున్నప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహ బంధం ఎందుకు బీటలు వాలుతుంది.? పాలనా పరమైన అంశాలలో తనకు అనుభవం లేదని, ఆ అనుభవాన్ని బాబు శిష్యరికంలో బాగా మెండుగా సంపాధించగలను అంటూ పవన్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు.
తానూ 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని ఒక రాజకీయ గురువుగా భావిస్తున్నాని చెపుతూ తనకు చంద్రబాబుకి మధ్య ఉన్న బంధాన్ని ఆవిష్కరించారు పవన్. అలాగే పవన్ తనకు సోదర సమానుడని, మా కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఒక అన్నగా వెన్నంటి ఉండి నాకు వ్యవస్థలతో పోరాడే మనోధైర్యాన్ని అందిచారంటూ లోకేష్, పవన్ గురుంచి ఎన్నో సందర్భాలలో ప్రస్తావించారు.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
ఇక కూటమి పెద్ద, ఇరు పార్టీలకు ముఖ్య నాయకుడు చంద్రబాబు కూడా తానూ ఆపదలో ఉన్నప్పుడు తనకు మద్దతు ఇవ్వడానికి పవన్ చూపిన తెగువను అటు అసెంబ్లీ వేదిక మీద కూడా ప్రస్తావించి పవన్ రాజకీయ ఎదుగుదలకు తన వంతు సహకారంగా పాలన పరమైన అనుభవం లేనప్పటికీ డిప్యూటీ సీఎం తో పాటు తానూ కోరుకున్న ఐదు శాఖలకు మంత్రిగా అవకాశం అందించారు.
నిజంగా వీరి ముగ్గురికి ఒకరి పదవి మీద ఒకరికి అభద్రతా భావం ఉన్నట్లయితే ఈ కూటమి బంధం పది పదిహేనేళ్ళు కొనసాగాలని, ఏపీకి మరో మారు బాబే సీఎంగా ఉండాలని పవన్ బహిరంగ ప్రకటనలు చేసేవారేనా.? అలాగే అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తనతో పాటు సమాన గౌరవం పవన్ కి ఇవ్వాలి అంటూ బాబు ఆదేశించేవారేనా.? నిజంగా తనకు డిప్యూటీ సీఎం కావాలి అనుకుంటే లోకేష్ ఇలా పార్టీ నేతల సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా.?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే ఈ ముగ్గురి మధ్య ఉన్న బంధం విలువ తెలుస్తుంది. ఇందులో చంద్రబాబు, పవన్ లను ‘గురు శిష్యుల’ బంధం’ కట్టిపడేస్తే, లోకేష్, పవన్ ల మధ్య ఏర్పడిన బంధం అన్నదమ్ముల’ స్నేహానికి అద్దం పడుతుంది.