రెండు రోజుల క్రితమే బోరుగడ్డ రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్‌తో కలిసి ఓ హోటల్‌లో బిర్యానీలు తిన్నందుకు ఏడుగురు పోలీసులను డిజిపి ద్వారకా తిరుమల రావు సస్పెండ్ చేశారు. కానీ పోలీసుల తీరులో ఎటువంటి మార్పు రాలేదని తాజా వీడియో నిరూపిస్తోంది. బోరుగడ్డ అనిల్ కుమార్‌ని విచారణ కోసం ఈరోజు గుంటూరు ఆరండల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
స్టేషన్‌కు తమపై అధికారి వస్తే పోలీసులు వినయంగా వ్యవహరించిన్నట్లు బోరుగడ్డతో వ్యవహరిస్తుండటం కెమెరాలో రికార్డ్ అయ్యింది. బోరుగడ్డ కంప్యూటర్ ఎదుట ఉన్న కుర్చీలో కూర్చోగా పోలీసులు నిలబడి మాట్లాడుతున్నారు. వారితో ఆయన ఏదో చెపుతుంటే అందరూ వింటూ ఆయన చెప్పిన్నట్లే ఓ పరుపు, దిండు, దుప్పటి తీసుకువచ్చి అక్కడే మరో బల్లపై పరిచి ఆయనకు పక్క ఏర్పాటు చేశారు.
Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?
ఆయన దుప్పటి కప్పుకొని దానిపై పడుకొని ఏదో చెపుతుంటే అటూ ఇటూ తిరుగుతున్న పోలీసులు అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ మాత్రం సమీపంలో కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ కనబడ్డారు.
ఈ వీడియో మళ్ళీ మీడియా, సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అవుతోంది. కనుక మళ్ళీ ఆ పోలీసులని కూడా సస్పెండ్ చేస్తారేమో? చేస్తే చేయనీ మాకు కొండంత అండగా బోరుగడ్డ, వైసీపి ఉన్నాయిగా?అని అంటారేమో?
Also Read – ఎప్పుడు దొరికిపోయినా ఎదురుదాడే వైసీపీ ఫార్ములా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు బోరుగడ్డ అనిల్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ పోలీస్ స్టేషన్‌లో అందరూ ఆయనకు రాచమర్యాదలు చేస్తుండటం విశేషం. అంటే పోలీసులలో వైసీపి విధేయులే ఎక్కువమంది ఉన్నారా లేదా బోరుగడ్డకి భయపడి రాచమర్యాదలు చేస్తున్నారా?వారే చెప్పాలి.