
1979లో పునాదిరాళ్ళు సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవిని మాజీ ముఖ్యమంత్రి జగన్ అవమానించి పంపారు. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని పీకి పక్కన పడేస్తే అది వారి అజ్ఞానమే అవుతుంది తప్ప దాని విలువ ఏమీ తగ్గిపోదు.
2006 లోనే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న చిరంజీవిని జగన్, వైసీపీ నేతలు అవమానించినా కేంద్ర ప్రభుత్వం 2024లో పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించడం వారికి చెంపదెబ్బ వంటిదే. మెగాస్టార్ చిరంజీవిని జగన్, వైసీపీ నేతలు అవహేళన చేసి ఉండొచ్చు కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో తనకంటూ ఓ శాశ్విత స్థానం సంపాదించుకున్నారు.
Also Read – ఆవేశంతో యుద్ధం చేస్తే అణు ప్రమాదం.. సిద్దమేనా?
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 19న హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటన్ పార్లమెంట్)లో బ్రిటన్ ప్రభుత్వం ఆయనని ఘనంగా సన్మానించి, జీవిత సాఫల్య పురస్కారం అందించబోతోంది. నాలుగున్నర దశాబ్ధాలుగా ఆయన సినీ పరిశ్రమకు, సామాజిక సేవలకు, ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఈ సన్మానం, అవార్డు అందుకోబోతున్నారు.
ఆయన రాజకీయాలలో రాణించలేకపోయారు కానీ నేటికీ సినీ రంగంలో తిరుగులేదని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు పిఠాపురంలో అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న రోజునే మెగాస్టార్ చిరంజీవికి ఈ అరుదైన గౌరవం లభిస్తున్న వార్త రావడం మెగా అభిమనులందరికీ చాలా సంతోషం కలిగిస్తుంది.
Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!