కేసీఆర్ వాస్తు ప్రకారమే ప్రగతి భవన్, సచివాలయం కట్టుకున్నారు. వాటిని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. ఎన్నికలలో తప్పకుండా గెలవాలని యాగాలు చేశారు కానీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. కూతురు కవిత 5 నెలలు తిహార్ జైల్లో ఉండక తప్పలేదు.
అంతా మాత్రన్న కేసీఆర్ నమ్మకాలు పోతాయని ఎవరూ అనుకోలేరు. ఎవరి నమ్మాకాలు వారివి. అందుకే తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మళ్ళీ చండీయాగం, నవగ్రహ యాగం చేయించారు. ఈసారి యాగంలో కవిత ఆమె భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Also Read – అవమానించిన వాడే ఆదర్శమయ్యాడా.?
అంటే ఆమెకు మళ్ళీ అటువంటి కష్టాలు కలుగకుండా చూడాలని, రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అనుకూల రాజకీయ వాతావరణ ఏర్పడాలని భగవంతుడిని కోరుకుంటూ కేసీఆర్ ఈ యాగాలు చేసిన్నట్లు భావించవచ్చు.
అలాగని మానవ ప్రయత్నం చేయకపోతే పైనున్న ఆ దేవుడు కూడా సాయం చేయడు. కనుక కవితని విడిపించుకు రావడానికి బిఆర్ఎస్ పార్టీని బలి ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తుంటారు. వారి వాదన ప్రకారం బిఆర్ఎస్ పార్టీని బలి ఇచ్చుకొని ఉంటే, ఇక కేసీఆర్ రాజకీయాలు ఎలా చేయగలరు?నేటికీ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు. అవకాశం దక్కినప్పుడల్లా సింగిల్స్ తీస్తూనే ఉన్నారు కదా?
Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?
కనుక ఓవరాల్‌గా చూసుకుంటే కవితని కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా పెట్టి, కేసీఆర్ రంగంలో దిగే అవకాశం కనిపిస్తోంది.
కవిత విడుదలతో ‘న్యాయం, ధర్మం గెలిచిందని’ స్పష్టమైంది కనుక ఇక ఆమె జోలికి కేంద్రం, దాని జోలికి కేసీఆర్ వెళ్ళకుండా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అవుట్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. అందుకు బీజేపీ కూడా ఫీల్డింగ్ చేసినా ఆశ్చర్యం లేదు. కనుక కేసీఆర్ ఊసుపోక యాగాలు చేశారని అనుకోలేము. ప్రస్తుతం సింబా సిద్దంగానే ఉంది మరి ‘ముఫాసా ది లయన్ కింగ్’ ఎప్పుడు బయటకు వస్తాడో?
Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్ డౌట్!