టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈరోజు విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ, “రాంగోపాల్ వర్మతో మాకేం సంబందం అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలకు జగన్ అక్రమ సంపాదన నుంచే పెట్టుబడి పెట్టారని అందరికీ తెలుసు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ దర్శకుడికైనా ప్రభుత్వం గన్ మ్యాన్‌లను కేటాయించిందా?కానీ రాంగోపాల్ వర్మకు మాత్రమే ఇద్దరు గన్ మ్యాన్‌లను కేటాయించారు. ఆయన ప్రకాశం బ్యారేజీ మీద సినిమా షూటింగ్ చేస్తుంటే, రెండు మూడు రోజులు బ్యారేజీకి ఇరువైపులా పోలీసులను మోహరించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇవన్నీ జగన్-వర్మ మద్య ఎంత సన్నిహిత సంబందం ఉందో చెపుతూనే ఉన్నాయి కదా?
Also Read – జగన్ అప్పులు చేసిపోతే.. చంద్రబాబు నాయుడు…
శాసనసభ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుని అప్రదిష్టపాలు చేసేందుకు వర్మ చేత జగన్ ‘వ్యూహం’ తీయించారని అందరికీ తెలుసు. ఆ సినిమాకి జగన్ అక్రమ సంపాదన నుంచే పెట్టుబడి పెట్టారు కనుక ఇది కూడా ‘క్విడ్ ప్రొ’ స్కామ్ వంటిదే.
ఆ సినిమా తీసిన వర్మని, ఆయన చేత తీయించిన జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇద్దరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నేను ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కోరుతున్నాను,” అని బుడ్డా వెంకన్న డిమాండ్ చేశారు.
Also Read – ఈ టాలీవుడ్‌కి ఏమైయిందో?
వర్మ తీసిన సినిమాలలో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, వ్యూహం వంటివన్నీ ప్రధానంగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని ఆయన దుష్టుడు, దుర్మార్గుడుగా చూపించారు. కనుక రాజకీయ దురుదేశంతోనే వాటిని తీశారని అర్దమవుతూనే ఉంది.
వాటన్నిటికీ జగన్ తన పార్టీ నేతల ద్వారా పెట్టుబడి పెట్టి తీయించారని బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వైసీపీకి చెందినవారే. వర్మ తీసిన ఆ సినిమాలను ప్రజలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పోలీసులు పట్టించుకుంటున్నారు.
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
అటువంటి సినిమాలు తీసి వర్మ తన పేరు చెడగొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు కూడా. అయితే ఇప్పుడు ఆయనని ఆదుకునేందుకు జగన్, వైసీపీ నేతలు ముందుకు రావడం లేదు. ఇప్పుడు రాకపోయినా వర్మని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే ఒకరి తర్వాత మరొకరు అందరూ స్టేషన్‌కి రాక తప్పదు కదా?