ys-jaganreddy

ఓ ప్రతిపక్ష నాయకుడు ఏవిదంగా పనిచేయాలో చంద్రబాబు నాయుడు చేసి చూపించారు. అధికారంలో లేనప్పుడు పార్టీని ఏవిదంగా నడిపించాలో చూపించారు. ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో ఆచరణలో చూపించారు. అధికారం కోల్పోయినప్పుడు పార్టీని ఏవిదంగా కాపాడుకోవాలో చూపించారు.

కనుక ఆయన ఓ ‘రాజకీయ గైడ్’ అని భావించవచ్చు. అలా భావించి, ఆయన పట్ల పూర్తి నమ్మకంతో కలిసి పనిచేసినందుకే జనసేన పార్టీ, దాని అధినేత పవన్‌ కళ్యాణ్‌ నేడు ఈ స్థాయికి చేరుకున్నారంటే అతిశయోక్తి కాదు.

Also Read – కేసీఆర్‌ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!

చంద్రబాబు నాయుడు కంటే వెయ్యి రెట్లు తెలివైనవాడినని గట్టిగా నమ్మే కేసీఆర్‌ పరిస్థితి ఇప్పుడు ఏవిదంగా అందరూ చూస్తూనే ఉన్నారు. నాలుగున్నర నెలలుగా ఢిల్లీ తిహార్ జైల్లో మగ్గుతున్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోలేకపోతున్నారు. శాసనసభకు వెళ్ళేందుకు భయపడుతున్నారు.

“ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పనిచేసే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయనతో పోటీ పడాలంటే రోజుకి 12-14 గంటలు పనిచేస్తే సరిపోదు ఇంకా ఎక్కువ పని చేయాలి,” అని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల అన్నారు.

Also Read – తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న వర్షాలు..!

ఆయనే కేసీఆర్‌ని ఉద్దేశ్యించి, “ఫామ్‌హౌస్‌లో కూర్చొని నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేయడం కాదు చంద్రబాబు నాయుడులా ప్రజల మద్యకు వెళ్ళి తిరుగు. ప్రజా సమస్యలపై నా ప్రభుత్వంతో పోరాడుతూ ఉండు. ఏదో రోజు నీకు మంచి జరుగకపోదు,” అని సలహా ఇచ్చారు.

అంతే చంద్రబాబు నాయుడుని ఓ ముఖ్యమంత్రిగానే కాక ఓ ప్రతిపక్షనేతగా కూడా స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారన్న మాట!

Also Read – వినాయక మంటపాలతో కూడా రాజకీయాలా… యాక్!

చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా గత 5 ఏళ్ళు ప్రజల మద్య రోడ్ల మీదనే ఉన్నారు. పోరాటాలు చేస్తూనే ఉన్నారు. తాను చేయడమే కాకుండా నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, టిడిపి, జనసేనల నేతలు, కార్యకర్తలను కూడా ప్రజాసమస్యలపై పోరాడేలా చేశారు.

అయితే జగన్‌ ముఖ్యమంత్రిగా ఎలా చేశారో? ఏం చేశారో అందరూ చూశారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షనేతగా ఏం చేస్తున్నారో చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే.

తాడేపల్లి ప్యాలస్‌లో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలను కలుస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అంతవరకు ‘కళ్ళు మూసుకు ఉండమని’ ధైర్యం చెపుతున్నారు. ఆ ప్రజలలో చిన్న పిల్లలు కూడా ఉండటం మరో విశేషం.

ఇంతకీ జగన్‌ వారిని ఓదార్చుతున్నారా లేక వారే జగన్‌ని ఓదార్చుతున్నారా?అనే అనుమానం కలుగక మానదు. ఎందుకంటే ఎన్నికలలో ఇంత ఘోరంగా ఓడిపోయినందున ప్రజలకు మొహం చూపించలేక తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తున్నారు కనుక.

ప్రజలను, పార్టీ కార్యకర్తలని ఇంటికి పిలిపించుకొని ఏసీ రూమ్‌లో కూర్చొని ఓదార్చి, సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తుంటే కేసీఆర్‌లాగే మిగిలిపోతారు. అవతల ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నేతలు రాజకీయ సన్యాసం చేసేస్తూనే ఉంటారని జగన్‌ గ్రహిస్తే మంచిది.




కనుక ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు సెట్ చేసిన గైడ్ లైన్స్ ఉండనే ఉన్నాయి. కనుక జగన్‌ కూడా మొహమాటపడకుండా వాటిని ఫాలో అయిపోతే చాలు… రేవంత్‌ రెడ్డి చెప్పిన్నట్లుగా అదృష్టం కలిసివస్తే మళ్ళీ ఎప్పుడో అప్పుడు అధికారం వచ్చినా రావచ్చు.