Chandrababu Delhi Visit, Andhra Defence Clusters, Private Space City, Missile Testing Andhra

ఏపీ సిఎం సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి కోరిన కోర్కెల గురించి విన్నప్పుడు తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కోర్కెలు తన కోసం కాదు తన రాష్ట్రం కోసం కోరుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబందించిన అంశాల గురించి మాట్లాడేందుకు అంటూ నెలకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి వచ్చేవారు. కానీ ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా రాష్ట్రానికి సాధించిందేమీ లేదు.

కానీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకు వస్తూనే ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆయన కోర్కెల జాబితా చూస్తే ఈ వయసులో కూడా ఇంత దూరదృష్టితో ఆలోచించగల ఏకైక వ్యక్తి ఈయనే అనిపిస్తుంది.

Also Read – ఇప్పుడు ఇద్దరికీ జైల్లో లైవ్ షో?

1. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌లో అందుబాటులో ఉన్న 6వేల ఎకరాలలో మిసైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.

2. లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

Also Read – “అమరావతి vs వైసీపీ” కథా చిత్రం..!

3. విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పర్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

4. కర్నూలు-ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు.

Also Read – పొదిలి ఘటన: వైసీపీ 2.0 కి జస్ట్ శాంపిల్.?

5. తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

6. శ్రీహరి కోట సమీపంలో 2వేల ఎకరాల్లో ఒక ప్రైవేట్ స్పేస్ సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేటు శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ చేయటానికి సహకరించాలని కోరారు.

7. ప్రైవేట్ స్పేస్ సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరిస్తే అక్కడే భారీ ఎయిర్ కార్గో, భారీ సీ కార్గో ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

8. భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో ఇప్పటికే ఎంవోయులు జరిగాయి. వాటన్నిటినీ వేగవంతం చేయాలని కోరారు.

9. నాగాయలంకలో మిసైల్ టెస్టింగ్ సెంటర్ మంజూరు చేసినందున సమీపంలో దోనకొండలో భారత్‌ వాయుసేన అవసరాలకు ‘ఎయిర్ స్పేస్ స్టేషన్‌’ ఏర్పాటుకి అవసరమైన స్థలం ఇచ్చామమని, అది ఏర్పాటైతే రక్షణ రంగంలో వ్యూహాత్మకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

నేను యువకుడిని, విదేశాలలో ఉన్నత విద్యలభ్యసించి రాజకీయాలలోకి వచ్చానని గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇటువంటి ఆలోచనలు కూడా రావు.

కానీ 74 ఏళ్ళ యువకుడు, నిత్య విద్యార్ధి సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అందివచ్చే టెక్నాలజీ గురించి తెలుసుకొని అవగాహన పెంచుకొని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తుంటారు.

రక్షణ రంగంలో ఆయన చేసిన ఈ ప్రతిపాదనలు, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వంటి ఆలోచనలు సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టికి చక్కటి నిదర్శనం.. కాదా?