Chandrababu Naidu Foresight on Caste Survey in Andhra Pradesh

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆరేడు నెలల వ్యవధిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇద్దరి వయసు, అనుభవం, కూడా చాలా తేడా ఉంది. కనుక వారి పాలనలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఇందుకు తాజా ఉదాహరణగా తెలంగాణలో కులగణన సర్వే, తదనంతర పరిణామాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు కుల రాజకీయాలు చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో కానీ కులాలు-రిజర్వేషన్స్‌లో వేలు పెడితే ఏకంగా చెయ్యే తిగిపోయే ప్రమాదం ఉంటుంది… అని నిరూపితమవుతోంది.

Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!

దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే కుల గణన చేసిందని, ఇది దేశానికే ఆదర్శమని, దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తమని అనుసరించక తప్పదని కాంగ్రెస్‌ మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు.

ఆ సర్వే నివేదిక ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్స్ ప్రకటించడంతో ముందుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలలో వారే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Also Read – సింహంలాంటి జగన్‌కి ఈ కష్టాలు ఏమిటో!

కుల గణనలో లక్షలమంది బీసీల వివరాలు నమోదు చేయకుండా, బీసీ జనాభాని తగ్గించి చూపుతూ, రిజర్వేషన్స్ విషయంలో అన్యాయం చేస్తోందంటూ బీసీ వర్గాలు ఉద్యమాలకు సిద్దం అయ్యాయి. బిఆర్ఎస్ పార్టీ వారందరినీ ఎగదోస్తోంది. బీజేపి కూడా ఈ కులగణన నివేదికని, రిజర్వేషన్స్‌ని తప్పు పడుతోంది.

దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోక రాష్ట్రంలో మళ్ళీ కులగణన సర్వే చేయించాలని నిర్ణయించింది. కానీ ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి మళ్ళీ సర్వే చేయిస్తుండటంతో వాటి వాదనలు నిజమని అంగీకరించిన్నట్లవుతుంది.

Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందనే భావన కలుగుతుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పైచేయి సాధిస్తుంది. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంశాన్ని తెరపైకి తెచ్చింది.

బీసీలకు జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్స్ కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని కోసం శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాని మోడీని కోరుతామని, ఒప్పుకోకపోతే దేశంలో అన్ని పార్టీలను కలుపుకొని బీసీలకు న్యాయం చేసేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అంటే ఎస్సీ వర్గీకరణకి ప్రయత్నిస్తే బెడిసికొట్టింది కనుక దానిని బీసీ రిజర్వేషన్స్ అస్త్రంతో ఎదుర్కొని తప్పించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.

ముందే చెప్పుకున్నట్లు కులాలు-రిజర్వేషన్స్ అంటే తేనెతుట్టెని కదపడమే అవుతుందని అనుభవజ్ఞుడైన సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అందుకే దాని జోలికి పోలేదు. లేకుంటే కుల రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అల్లకల్లోలం అయ్యేది.




సున్నితమైన ఈ సమస్యలో చిక్కుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఏవిదంగా బయటపడుతుందో తెలీదు కానీ ఏపీలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి వలన ప్రశాంతంగా ఉంది.