ఆచార్య… అంటే గురువుగారు విద్యార్దులకు మార్గదర్శనం చేస్తూ వారు చక్కటి భావిభారత పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడుతుంటారు. అయితే మన ఆచార్య లక్ష్మీ పార్వతి మాత్రం రాజకీయాలను ఔపోసన పట్టారు. ఎన్టీఆర్‌ని ఆశ్రయించి మెల్లగా టిడిపిని హస్తగతం చేసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు. దాంతో ఆమె రాజకీయ ఎదుగుదలకి బ్రేక్ పడిందనే చెప్పవచ్చు.
ఆ ద్వేషంతోనే ఆమె రగిలిపోతూ, చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే పార్టీ విధానంగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి పక్కన చేరారు. కనుక జగన్, లక్ష్మీ పార్వతి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తారు? అంటే జవాబు చెప్పడం కష్టమే.
Also Read – వినాయక మంటపాలతో కూడా రాజకీయాలా… యాక్!
అవకాశం దొరికినప్పుడల్లా ఆమె తనివితీరా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరుగుతుండటం ఆమెకు ఓ అర్హతగా మారింది. బహుశః ఆ అర్హతతోనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ‘గౌరవ ఆచార్యులు’గా గుర్తింపు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ పదవి పొంది ఉండవచ్చు.
కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, వారిరువురూ అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావడంతో వారు ఊహించనివన్నీ జరుగుతున్నాయిప్పుడు.
Also Read – కేసీఆర్ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!
చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే చేసిన అనేక ముఖ్యమైన పనులలో ఆంధ్రా యూనివర్సిటీ ప్రక్షాళన కూడా ఒకటి.
దాంతో లక్ష్మీ పార్వతికి ఇచ్చిన ‘గౌరవ ఆచార్యురాలు’ పదవి ఊడిపోయింది. అంతకు ముందే తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ పదవి కూడా ఊడింది. ఆమెకు ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాని ఉపసంహరించుకుని, తెలుగు విభాగంలో ఆమె వద్ద శిష్యరికం చేస్తున్న పీహెచ్‌డీ విద్యార్దులను వేరే ఆచార్యునికి బదిలీ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కిషోర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కనుక ఇక నుంచి ఆమె పూర్తి సమయం జగన్ భజన చేసుకోవచ్చు.