
సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన తర్వాత కలెక్టర్ కార్యాలయం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
సుమారు గంటన్నరసేపు సాగిన ఈ ప్రెస్‌మీట్‌లో సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు విన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చాలా సమర్ధుడైన నాయకుడి చేతిలో చాలా భద్రంగా ఉందని అర్దమవుతుంది.
Also Read – జగన్ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అభివృద్ధి, ప్రజలు, ఆరోగ్యం, టెక్నాలజీ, మౌలిక వసతుల అభివృద్ధి ఇలా ప్రతీ అంశం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఆయా అంశాలపై సాధికారతని, దూరదృష్టిని సూచిస్తున్నాయి.
· హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి తాను అతికష్టం మీద విశాఖ చేరుకున్నాక ఏవిదంగా ముందుకు సాగారో వివరిస్తూ, నాయకుడనేవాడు ప్రజలలో మళ్ళీ ధైర్యం, నమ్మకం కలిగించాలి. నేను అదే చేశాను. ఆ నమ్మకంతోనే అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేసి చాలా త్వరగా ఆ ప్రకృతి విధ్వంసం నుంచి బయటపడ్డారు.
Also Read – హిందీ భాష పై బాబు స్పందన…
· ప్రధాని మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో జరపాలని చెప్పినప్పుడు వెంటనే అంగీకరించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించుకొని విజయవంతంగా నిర్వహించి ప్రధాని మోడీ ప్రశంశలు అందుకున్నాము.
· ఇన్ని లక్షల మందితో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఎక్కడా చిన్న తప్పు, అవాంఛనీయ ఘటన జరుగకుండా నిర్వహించాము. అధికారులు, ఉద్యోగులు అందరూ చాలా వేగంగా అన్ని పనులు చక్కబెట్టేశారు. ఇది మన అందరి సమిష్టి విజయం. ఈ కార్యక్రమం కొరకు రేయింబవళ్ళు కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
Also Read – కమల్ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!
· ఈ కార్యక్రమం విజయవంతం అవడం ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన మార్పులకి సిద్దంగా ఉన్నారని, ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని స్పష్టమైంది.
· ముఖ్యంగా దీనిలో పాల్గొన్న సామాన్య ప్రజలు మొదలు ప్రధాని మోడీ వరకు ప్రతీ ఒక్కరూ సంతృప్తితో తిరిగి వెళ్ళరు. ఇదే చాలా ముఖ్యం. ఈ కార్యక్రమానికి అయిన ఖర్చులో కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు ఇప్పుడే ఢిల్లీ నుంచి కబురు వచ్చింది. గిన్నీస్ రికార్డులతో పాటు ఇది కూడా మన విజయానికి లభించిన మరో గుర్తింపు.
· ప్రపంచంలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో మన తెలుగువాళ్ళు చాలా ముందుంటారు. కష్టపడి పనిచేయడంతో పాటు స్మార్ట్ గా పనిచేయడం కూడా చాలా అవసరం. అలా చేసినవాళ్ళే రాణిస్తున్నారు. ఐటి రంగాన్ని మనవాళ్ళు శాసించడం చూస్తే ఇది అర్దమవుతుంది.
· ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖ కేంద్రంగా, అటు రాయలసీమ జిల్లాలను తిరుపతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దం చేసిన, చేస్తున్న ప్రణాళికలను ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు.
· ప్రధాని మోడీ కూడా టెక్నాలజీని చాలా త్వరగా అడాప్ట్ చేసుకుంటారు. అందుకే దేశంలో వివిద రంగాలలో ఇంత వేగంగా అభివృధ్ది జరుగుతోంది.
· టెక్నాలజీ విషయంలోనే కాదు ఆరోగ్యం విషయంలో కూడా ప్రధాని మోడీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడికి వచ్చే ముందు మూడు దేశాలు, మూడు రాష్ట్రాలలో తిరిగి అనేక మందితో సమావేశాలలో పాల్గొని, విశాఖకు వచ్చి యోగాలో పాల్గొన్నారు. ఢిల్లీకి తిరిగి వెళ్ళగానే మళ్ళీ బోలెడన్ని పనులు చక్కబెడతారు. ఆయన ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారంటే యోగా, పౌష్టికాహారం, పాజిటివ్ థింకింగ్ వల్లనే.
· నేను కూడా ఇదే ఫాలో అవుతాను. అందువల్లే మేమిద్దరం అనారోగ్యంతో మంచం ఎక్కిన వార్తలు మీకు దొరకవు. కనుక ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యం కోసం రోజు ఓ గంట సమయం కేటాయిస్తే చాలు. జీవితంలో మార్పు మొదలవుతుంది.
· భవిష్యత్ కోసం నా ఆలోచనలు అందరికీ అర్దం కావు. కనుక చాలా మంది చులకనగా మాట్లాడుతుంటారు. అపార్ధం చేసుకుంటారు. నేను క్వాంటమ్ టెక్నాలజీ గురించి నేను మాట్లాడితే అర్ధం కానివారు విమర్శిస్తున్నారు కదా?అని సిఎం చంద్రబాబు నాయుడు చిన్న ఉదాహరణ చెప్పారు.