
జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం నా బీసీలు.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. నా మైనార్టీలు.. అంటూ కూనిరాగాలు తీసేవారు. ప్రతీ బటన్ నొక్కుడు సభలో ‘నా అక్కమ్మలు.. చెల్లెమ్మలు..’ అంటూ పాట పాడేవారు.
వారందరికీ తలో పధకంతో వారి చేతిలో డబ్బు పెట్టడమే వారి పట్ల తన అభిమానానికి నిదర్శనమని, చెప్పిన సమయానికి టంచనుగా బటన్ నొక్కి డబ్బు అందించడమే విశ్వసనీయత అని జగన్ అనుకునేవారు.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
కానీ వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కల్పించివ తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయాలని ఏనాడూ అనుకోలేదు. ఎందువల్ల అంటే వారు ఆ డబ్బు కోసమైన వైసీపీకి ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తారని జగన్ భావించారు కనుక.
కానీ జగన్ ఇంత దూరం ఆలోచించి అప్పులు చేసి సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెట్టినా ‘అక్క చెల్లెమ్మలు నాకు ఎందుకు ఓట్లు వేయలేదో?’ అని బాధపడ్డారు కూడా. అంటే వారిపై ప్రేమతో కాదు వారి ఓట్ల కోసమే అని స్పష్టమవుతోంది.
Also Read – జగన్ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!
ఎన్నికలలో ఒడిపోయినప్పటికీ తాను మొదలుపెట్టిన సంక్షేమ పధకాలను కూటమి ప్రభుత్వం యధాతధంగా అమలుచేయడమే అత్యుత్తమ విధానం.. అదే పాలన అని జగన్ వితండవాదం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడటం చాలా ముఖ్యమని సిఎం చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతుంటారు.
Also Read – అయ్యో పాపం.. టీడీపీ కార్యకర్తలు!
మహిళా సాధికారత అంటూ సిఎం చంద్రబాబు నాయుడు పెద్ద మాటలు చెప్పడం లేదు. కానీ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉద్దేశ్యంతో పారిశ్రామిక విధానం ప్రకటించారు.
బీసీలకైతే 45 శాతం పెట్టుబడి రాయితీ, రవాణా, విద్యుత్ రాయితీలు, జెఎస్టీ రీ ఇంబర్స్మెంట్ లభిస్తుంది. అదే ఏసీ, ఎస్టీలకైతే 75 శాతం లేదా గరిష్టంగా రూ.25 లక్షల వరకు రాయితీలు లభిస్తాయి.
మహిళలు సంక్షేమ పధకాల కోసం ఎదురుచూపులు చూడటం, ప్రభుత్వం ముందు చేయిజాపడం గొప్ప కాదు. వారు స్వయం ఉపాధితో తమ కాళ్ళపై తాము నిలబడేలా చేసి వారే మారికొందరికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా చేయడమే గొప్ప కదా? సంక్షేమ పధకాలు, మహిళా సాధికారత ఏది గొప్ప?