Chandrababu Press Meet

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రజలకు జవాబుదారిగా పని చేస్తున్నారు. అందునా మరి ముఖ్యంగా బాబు 1995 నాటి చంద్రబాబును చూస్తారు అంటూ ఏపీ ప్రజలకు హైప్ ఎక్కిస్తూనే అధికారులను పరిగెత్తిస్తున్నారు.

మొన్న అమరావతి, పోలవరం మీద సమీక్షలు చేసి వాటి ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు వివరించారు. అలాగే నేడు విద్యుత్ శాఖ మీద సమీక్షలు చేసిన బాబు ఆ శాఖ మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేసారు. గత ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి అటు ప్రజలు మీద మోయలేని భారం వేసింది.

Also Read – చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదుగా!

అలాగే ప్రభుత్వం వాడుకొని కరెంట్ కు 9 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపారు. వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్లనే 1 లక్ష 29 వేల కోట్ల రూపాయిల అప్పుల భారం ఒక్క విద్యుత్ శాఖ మీదే పడిందని ప్రతి విషయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు బాబు.

ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం ప్రజలకు ఉచిత ఇసుక ను అందుబాటులోకి తెచ్చామని, దీని మీద కూడా వైసీపీ దుష్ట రాజకీయం మొదలు పెట్టిందని ప్రజలకు వివరించారు బాబు. నిధుల కోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి వచ్చానని ప్రజలకు అన్ని వివరాలను వివరిస్తూ పూర్తిగా జవాబుదారిగా ఉన్నారు బాబు.

Also Read – బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతోంది… ఎందువల్ల?

అలాగే వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్ల పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ రైతులకు భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో గృహ వినియోగదారుల మీద 45 % చార్జీలు పెంచారు. విద్యుత్ శాఖను గాడిలో పెట్టి ప్రజలకు అదనపు భారం లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

పనిలో పనిగా అధికారులకు కూడా తనదైన స్టైల్ లో ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేసారు. ఇష్టానుసారంగా ఎప్పుడుపడితే అప్పుడు పవర్ కట్స్ కానీ, లో ఓల్టాజ్ పవర్ సమస్యలు కానీ లేకుండా క్వాలిటీ విద్యుత్ అందించాలని, ఎవరైనా తమ స్థాయికి తగ్గట్టుగా పని చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానంటూ హై ఓల్టేజ్ హెచ్చరికలు పంపారు.

Also Read – జగన్‌ భవిష్యత్‌ కార్యాచరణ ఏమైనా ఉందా?