
జనసేన శ్రేణులకు ఆ పార్టీ తాలూకా విజయ గర్వం ఎదో ఒక సందర్భంలో బయటకొస్తూనే ఉంటుంది. అయితే ఓటమిలో ఒంటరి పోరు చేసి ఎన్నో అవమానాలను ఎదుర్కున్న జనసేన గెలుపు లో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించి అంతకు మించిన ప్రశంసలను చూస్తుంది.
విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన మెగా స్టార్ చిరంజీవి ‘జై జనసేన’ అంటూ నినాదం చేస్తూ ప్రజా రాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ జనసేన ఫాలోవెర్స్ కు, మెగా అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించారు.
Also Read – హస్తినలో అరకు కాఫీ ఘుమఘమలు
దీనితో జనసేన శ్రేణుల ముఖాలు ‘చిరు’దరహాసం తో పులకించాయి. గతంలో జనసేన ప్రస్తావన తెచ్చినా, పవన్ ఊసెత్తినా ఇది రాజకీయాలకు సమయం కాదు అంటూ మాటేదాటేస్తూ అన్నగా తన తమ్ముడి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నా అంటూ ఒకే మాటతో ముగించే వారే కానీ జనసేనకు ఎన్నడూ పొత్తు ముందు వరకు చిరు బహిరంగ మద్దతు తెలపలేదు.
అలాగే జనసేన కు రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ మూడు రాజధానుల విధానానికి కూడా చిరు మద్దతు తెలిపి ఏపీ ప్రజల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇదంతా కూడా గడిచిపోయిన గతం. వైసీపీ రాజకీయాలకు భయపడో, జగన్ ను ఎదిరించే సాహసం చెయ్యలేకనో, కనీసం వైసీపీ పవన్ ను హద్దులు దాటి దూషిస్తున్నప్పటికీ చిరు వాటిని ఖండించే ప్రయత్నం చెయ్యలేదు.
Also Read – చంద్రబాబుని చూపిస్తా.. సెంటిమెంట్ రగిలిస్తా!
కానీ ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ లో జై జనసేన అంటూ నినదించడం తో జనసైనికులు ఒక్కసారిగా ఉబ్బితబ్బిబవుతున్నారు. తమ్ముడి మీద ప్రేమ కన్నా జగన్ మీద భయం ఇన్నాళ్లు చిరు నోటికి తాళం వేసి ఉండవచ్చు. కానీ ఏపీలో ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో స్టార్సే కాదు సామాన్యుడు కూడా ఎవరి అభిప్రాయాన్ని, ఎవరి ఇష్టాఇష్టాలను వారు బహిరంగానే భయం లేకుండా వ్యక్తపరచగలుగుతున్నారు.
అలాగే ఇటు పుష్ప -2 విజయం మీద కూడా స్పందిస్తూ ఆ సక్సెస్ నాకు గర్వంగా అనిపిస్తోందన్నారు. దీనితో ఇటు బన్నీ అభిమానులు కూడా చిరు మాటలతో కాస్త కూల్ అయ్యారనిపిస్తుంది.