CM CBN

ఒక్కోసారి యుద్ధం చేయకుండానే శత్రువుపై విజయం సాధించవచ్చు.. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్‌ గెలుపుకి తోడ్పడి కేసీఆర్‌ని గద్దె దించడమే ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ.

ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీతో రెండు రకాలుగా యుద్ధాలు చేస్తున్నారు. మొదటి రకం డైరెక్ట్ వార్. దీనిలో వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను వెలికి తీసి కేసులు నమోదు చేయించి లోపల వేయిస్తూ వారికి భయం పుట్టించగలుగుతున్నారు.

Also Read – జగన్‌ దండయాత్రలే వైసీపీకి శాపంగా మరబోతున్నాయా?

రెండో రకం యుద్ధంలో కత్తి తిప్పకుండా వరుసపెట్టి సంక్షేమ పధకాలు అమలు చేస్తూ జగన్‌ ఓటు బ్యాంకునొ కొల్లగొట్టేస్తున్నారు.

మొదటి రకం యుద్ధం ఊహించిందే కనుక జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ మానసికంగా జైలుకి వెళ్ళడానికి సిద్దమయ్యారు. పంపితే నో చెప్పకుండా వెళ్ళి వస్తున్నారు కూడా. తద్వారా తాము చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపుల బాధితులమని చెప్పుకునే వెసులుబాటు ఉండనే ఉంది.

Also Read – వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ ఇంతేనా?

కానీ సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ రెండో రకం యుద్ధంలో జరిగే నష్టమే అపారం అని జగన్‌ కాస్త ఆలస్యంగా గ్రహించారు.

గత 5 ఏళ్ళలో తాను చేసిన ఆర్ధిక విధ్వంసంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఒక్క పధకం కూడా అమలుచేయలేరనే జగన్‌ గట్టి నమ్మకంతో ఉండేవారు.

Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!

అందుకే ‘హామీలు అమలు ఇంకా ఎప్పుడు?’ అంటూ పదేపదే నిలదీసేవారు. కానీ జగన్‌ ఊహించని విదంగా సిఎం చంద్రబాబు నాయుడు వరుసపెట్టి సంక్షేమ పధకాలు అమలుచేస్తుండటం జగన్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు పధకాల అమలులో ‘గోల్ మాల్‌’ జరిగిపోతోందంటూ కొత్త పాట మొదలుపెట్టేశారు.

సంక్షేమ పధకాల పేరుతో చంద్రబాబు నాయుడుని రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేయాలని జగన్‌ అనుకుంటే, సరిగ్గా వాటితోనే జగన్‌ని రాజకీయంగా హైజాక్ చేశారని చెప్పవచ్చు.

ఒకవేళ నిజంగానే పధకాల డబ్బు లబ్ధిదారులకు అందకపోతే అప్పుడు వారే రోడ్లపైకి వచ్చి నిలదీస్తారు కదా?కనుక లబ్ధిదారులను మోసం చేస్తే చంద్రబాబు నాయుడు ఇమేజ్.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటుంది కదా?

కానీ లబ్ధిదారుల కంటే ముందు జగన్‌, వైసీపీ నేతలు, వారి మీడియా ఎందుకు మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు?అంటే ఈ సంక్షేమ పధకాల ప్లాన్ కూడా బెడిసికొట్టిందనే బాధతోనే.

తాము ఏదో అనుకొని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే రెచ్చగొడితే, ఆయన వాటితోనే తమని రాజకీయంగా హైజాక్ చేస్తున్నారని గ్రహించడం వల్లనే ఈ బాధ.. ఈ మొసలి కన్నీళ్ళు.

చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేద్దామని, చేస్తే అరెస్ట్‌ చేసి జైల్లో పెడితే ప్రజల సానుభూతి పొందవచ్చని జగన్‌ ఆశపడ్డారు. కానీ ఆయన యుద్ధం చేయకుండా సంక్షేమ పధకాలతో ఇలా కంకు దెబ్బలు కొడుతుంటే జగన్‌కి బాధ కలగకుండా ఉంటుందా?