CM Chandrababu Naidu Meeting with Officials

జగన్‌ ప్రభుత్వం సుమారు 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. చిన్నా పెద్దా కాంట్రాక్టర్లందరికీ కలిపి రూ. రూ.1.30 లక్షల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఎగవేశారు. అంత బకాయిలున్నప్పుడు రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగి ఉండాలి కదా?కానీ ఒక్క ఋషికొండ ప్యాలస్‌ తప్ప మరే ప్రాజెక్టు పూర్తి కాలేదు.

రాష్ట్రంలో ఎక్కడ చూసిన గుంతలు పడిన రోడ్లే దర్శనమిచ్చేవి. బలవంతంగా చెత్త పన్ను వసూలు చేసినా చెత్త కుప్పలు తీయించనే లేదు.. డ్రైనేజీలు శుభ్రం చేయించనే లేదు.

Also Read – జగన్‌ 2.0 కోసం కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళాలా?

ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేసినా, జగన్‌ దిగిపోయే సరికి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు రూ. 71,762 కోట్ల అప్పులు, మరో రూ.29,377 కోట్ల నష్టాలు కలిపి సుమారు లక్ష కోట్లు! ఇక జగన్‌ తాకట్టు పెట్టేసిన ప్రభుత్వాస్తులు ఎన్నో నేటికీ ఇంకా లెక్క తేలలేదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధికారం అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు దోచేసింది ఒక్కటీ మరో ఎత్తు. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో, న్యాయ రాజధానాయి పేరుతో సీమ జిల్లాలలో వైసీపీ నేతల భూకబ్జాలకు లెక్కే లేదు.

Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?

ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, కంకర, మద్యం వగైరాల మాఫియా దోపిడీల విలువ ఎన్ని లక్షల కోట్లో ఎవరికీ తెలీదు.

జగన్‌ హయంలో జరిగిన ఈ అప్పులు, బకాయిలు, దోపిడీ, రాజధాని నిర్మించకపోవడం వలన కలిగిన నష్టం వీటన్నిటినీ లెక్క కట్టడం బహుశః ‘కాగ్’కి కూడా సాధ్యం కాదేమో?

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

ఇటువంటి పరిస్థితిలో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేయగలరని వైసీపీ నేతలే అనుకొంటున్నారు.

కానీ ఈ సమస్యలన్నీటినీ ఏవిదంగా పరిష్కరించాలో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. శనివారం ఉండవల్లిలో తన నివాసంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన చెప్పిన ఓ చిన్న ఉదాహరణ ఇందుకు నిదర్శనం

అనకాపల్లి జిల్లాలో మిట్టల్ కంపెనీ, దాని అనుబందం పరిశ్రమల ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి. వాటి జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.24,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఆదేవిదంగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న పరిశ్రమలు, ఐటి కంపెనీల ద్వారా కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఇవికాక కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే అభివృద్ధి పనులు, పధకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై చాలా భారం తగ్గించుకోవచ్చని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఉదాహరణకు ప్రధాన మంత్రి కుసుమ్ పధకం కింద లభించే రాయితీని వినియోగించుకుంటూ సౌర విద్యుత్‌తో పనిచేసే 4 లక్షల వ్యవసాయ పంప్ సెట్స్‌ సమకూర్చడం వలన ఉచిత విద్యుత్ భారం తగ్గించుకోవచ్చని చెప్పారు.




సిఎం చంద్రబాబు నాయుడుకి ఇటువంటి దూరదృష్టి ఉంది కనుకనే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాదు దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలబెట్టగలనని నమ్మకంగా చెపుతున్నారు.