CM CBN

పాలకులకు దూరదృష్టి ఉన్నప్పుడే ఆ దేశం, ఆ రాష్ట్రం బాగుపడుతుంది. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ‌టి రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని గుర్తించి ఆ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు.

ఐ‌టి రంగంలో విస్తృతంగా మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తుండటంతో ఆనాటి యువత దానిని అందిపుచ్చుకుని నేడు జీవితంలో చాలా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఐ‌టి రంగానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. వాటిలో కూడా వేల ఉద్యోగాలు వచ్చాయి.

Also Read – హైడ్రా ముగిసిన అధ్యాయమేనా.?

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయిందని గుర్తించిన చంద్రబాబు నాయుడు, పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తెచ్చేందుకు గట్టిగా కృషి చేశారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం మొదలుపెట్టి జాతీయ అంతర్జాతీయ సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను రప్పించేందుకు చాలా కృషి చేశారు. మద్యలో జగన్‌ అనే అవరోధంతో ఆయన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయాయి.

కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే, ఈసారి అన్ని పనులు పూర్తిచేయడానికి మూడేళ్ళు డెడ్‌లైన్‌ పెట్టుకొని చేయిస్తున్నారు.

Also Read – పుష్ప-2: కచ్చితంగా పునః సమీక్ష అవసరం!

సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో పున్నమి ఘాట్ నుంచి సీ-ప్లేన్ సర్వీసులు ప్రారంభించి, దానిలోనే శ్రీశైలం వెళ్ళివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భవిష్యత్‌ ఏ ఇజాలు ఉండవు కేవలం టూరిజం మాత్రమే ఉంటుందని నేను ఇదివరకే చెప్పాను.

సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం, మార్క్సిజం వంటివన్నిటినీ టూరిజం ఒక్కటే పక్కకు పెట్టేలా చేస్తుంది. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగానే ఈ సీ ప్లేన్ సర్వీసులు ప్రవేశపెడుతున్నాము,” అని చెప్పారు.

Also Read – ఎప్పుడు దొరికిపోయినా ఎదురుదాడే వైసీపీ ఫార్ములా?

తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌ తన రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు దాని వలన తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించడమే కాక ఆయా ప్రాంతాలలో ఉన్నవారికి, రంగంలో ఉన్నవారికి ఉపాధి లభిస్తోంది కూడా.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కి పర్యాటక ఆకర్షణ కేంద్రాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా సువిశాలమైన సముద్రతీరం, ఎక్కడికక్కడ నదులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ఆకర్షణ కేంద్రాలు, పోర్టులు, విమానాశ్రయాలు అన్నీ ఉన్నాయి. కానీ పర్యాటక రంగాన్ని ఏపీకి ‘బంగారుగుడ్లు పెట్టే బాతు’ అని జగన్‌ గుర్తించలేకపోయారు. సిఎం చంద్రబాబు నాయుడు గుర్తించారు.

ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయబోతున్నారు కనుక ఆయన చెప్పిన్నట్లు భవిష్యత్‌లో పర్యాటక రంగం నుంచి ఏపీకి భారీగా ఆదాయం, ఉపాధి లభించడం ఖాయమే.