CM Revanth Reddy

సినిమాలు, రాజకీయాలు, క్రీడలు, పరిశ్రమలు, వ్యాపారాలు.. ఇలా ఏ రంగంలోనైనా చరిత్ర పాఠాలు తప్పక ఉంటాయి. కనుక ఆయా రంగాలలో రాణించాలనుకునేవారు ఓ సారి ఆ చరిత్ర పాఠాలు తిరగేస్తే, ఏవిదంగా ముందుకు సాగితే రాణించవచ్చో, ఎటువంటి తప్పులు చేస్తే నష్టపోతారో సులువుగా తెలుసుకోవచ్చు. కనుక అన్నీ మన స్వీయ అనుభవాలతోనే నేర్చుకోవాల్సిన అవసరం లేదు.

ఏపీ మాజీ సిఎం జగన్‌ సంక్షేమ పధకాలతో రాష్ట్ర రాజకీయాలను మేనేజ్ చేయాలని ప్రయత్నించారు. అలాగని దేశంలో, రాష్ట్రంలో అంతకు ముందు సంక్షేమ పధకాలు లేకపోలేదు. కానీ కేవలం సంక్షేమ పధకాలనే ప్రధాన అజెండాగా చేసుకొని జగన్‌ బటన్ నొక్కుతూ రాష్ట్రాన్ని నడిపించడమే సరికొత్త ప్రయోగం.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

ఒకవేళ ఆయన ‘సంక్షేమ బటన్’ సరిగ్గా పనిచేసి ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ఉండి ఉంటే, దేశమంతా ‘జగన్‌ మోడల్’ రాజకీయాలు మొదలయ్యి ఉండేవి.

కానీ ఆయన ప్రయోగం బెడిసికొట్టింది. దేశప్రజలందరూ అది అందరూ చూశారు. కనుక పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడలేదనుకోలేము.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

ఏపీలో ‘జగన్‌ మోడల్’ విఫలమైందని తెలిసిన తర్వాత కూడా ఆయన అదే మోడల్ ద్వారా వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

నిన్న శాసనసభ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “నా సంక్షేమ పధకాలు-వాటి లబ్ధిదారులే నా ఓటర్లు. వారే మా పార్టీని మళ్ళీ గెలిపిస్తారు. నేను మళ్ళీ ముఖ్యమంత్రినవుతాను,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

జగన్‌ మోడల్‌తో ఆశించిన ఫలితాలు రాకపోగా ఘోరంగా బెడిసికొట్టే ప్రమాదం ఉందని తెలిసి ఉన్నా సిఎం రేవంత్ రెడ్డి దానికే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ దానికే ఆయన కట్టుబడి ముందుకు సాగితే, 2028 ఎన్నికల ఫలితాలు ఏవిదంగా ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు.