ప్రజలు ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాలను మారుస్తుంటే మారిన ప్రభుత్వాలు వచ్చిన అధికారంతో ప్రజలకు తన మార్క్ రాజకీయం చూపించడానికి రాష్ట్ర భవిష్యత్తుని సైతం రాజకీయ జూదంలో నిలబెడుతున్నారు.
2019 ఎన్నికలలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని మార్చి వైసీపీ ఒక్క ఛాన్స్ కు అవకాశం ఇచ్చారు ఏపీ ఓటర్లు. అయితే వచ్చిన అవకాశాన్ని వైసీపీ రాష్ట్ర రాజధానితో జూదం ఆడుతూ కొన్ని కోట్ల ప్రజల జీవితాలను తాకట్టు పెట్టింది. ఐదేళ్ల జగన్ పాలన మరో రెండు తరాల జీవితాలకు రాష్ట్రంలో ఉపాధి అనే నౌక దరిదాపులో లేకుండా చేసింది.
Also Read – కేసీఆర్, కేటీఆర్ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?
రాజధానిని మార్చి, పరిశ్రమలను తరిమేసి, పెట్టుబడులను పోగొడుతూ రాష్ట్ర అధికార ముద్రను కూడా చెరిపేసి దాని స్థానంలో జగన్ చిత్రాన్ని ముద్రించి నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు అంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు చేశారు. అభివృద్ధితో చూపించాల్సిన మార్పుని కూల్చివేతలతో కూడిన విధ్వంసాలతో చూపిస్తున్నారు.
గత ప్రభుత్వాల ఆనవాళ్లు కనిపించకూడదు అనే ముర్కత్వంతో నాయకులుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రజల మనోభావాలను గాలికొదిలేస్తున్నారు. గతంలో ఇటువంటి తరహా రాజకీయాలు కానీ వాటిని ప్రోత్సహించే నాయకులు కానీ కనిపించేవారు కాదు. కానీ నేడు రాజకీయాలలో ఆ పరిస్థితులు పూర్తిగా కనుమరుగవుతూన్నాయి. నువ్వు నిర్మిస్తే నేను కూలుస్తా అనే ధోరణిలో నాయకుల ఆలోచనలు కొనసాగుతున్నాయి. దీనికి ఎవ్వరు అతీతులు కాదనేది రుజువు అవుతూనే ఉంది.
Also Read – షిప్ సీజ్ అయ్యింది…ఇక అసలు కథ మొదలయ్యింది…!
తాజాగా అధికార మార్పిడి జరిగిన తెలంగాణలో కూడా ఇపుడు ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కేసీఆర్ ను గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ కి అవకాశమిచ్చారు తెలంగాణ ఓటర్లు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు తన మార్క్ పరిపాలన చూపించడానికి TS గా ఉన్న తెలంగాణ TG గా మార్చారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’…పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తో కలిసి ఆ పాటకు మెరుగులు దిద్దారు రేవంత్. తాజాగా మరో మార్పుకి శ్రీకారం చుట్టిన రేవంత్ తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం పై కూడా పలు నమూనాలను పరిశీలించి చిత్రకారుడు రుద్రరాజేశం కు సూచనలు చేశారు.
Also Read – మా పాలిట ‘వరం’ సామి..!
తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన ఆలోచనలకు తగ్గట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు రేవంత్ వాటి స్థానంలో తన ఆలోచనలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాష్టానికి సంబంధించిన అధికారిక చిహ్నాలను మారుస్తూ, రాజధానులను మారుస్తూ మార్పు మంచిదే అనే భావనలో రాజకీయ నాయకులు ఉంటే ఆ మార్పు తాలూకా పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు సిద్ధంగా ఉండాలి.